![Stalin Decalres His Movable Assets In Upcoming Election - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/16/Stalin-e1563092955714.jpg.webp?itok=ZwQgdRJM)
చెన్నై:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలలో నాయకులు తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తన వద్ద రూ.4.94 కోట్ల స్థిరాస్తులు, 2.24 కోట్లు చరాస్తులు ఉన్నట్లు సోమవారం ప్రకటించారు. తన పేరిట ఎలాంటి వాహనం లేదని, నగదు రూపంలో రూ. 50,000 ఉన్నట్లు తెలిపారు. మరో వైపు తన భార్య పేరిట 30,52,854 విలువైన చరాస్తుల ఉన్నాయని , 24.77 లక్షల విలువైన పాత బంగారు ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు ఏవీ లేవని, ఇతర అప్పులు కూడా లేవని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే జీతం, బ్యాంకు డిపాజిట్లు, అద్దెల ద్వారా తన ఆదాయం సమకూరుతున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2016 లో ప్రకటించిన అఫిడవిట్ లో, స్టాలిన్ 80.33 లక్షల విలువైన చరాస్తులు, 3.33 కోట్ల రూపాయల విలువ గల స్థిరాస్తులను చూపించారు. ఒక దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న అన్నాడిఎంకేను గద్దె దించడమే లక్ష్యంత ఏర్పడిన ప్రతిపక్ష కూటమికి స్టాలిన్ నాయకత్వం వహిస్తున్నారు.
ఈ సారి తనయుడి రాజకీయ ఆరంగ్రేటం
ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మొదటి సారిగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన వద్ద 21.13 కోట్ల చరాస్తులు ,రూ.6.54 కోట్ల విలువవైన స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. నగరంలోని చెపాక్-ట్రిప్లికేన్ సెగ్మెంట్ కు నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో డిఎంకె యూత్ వింగ్ చీఫ్ ఈ విధంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment