చైనా కావరం.. అణు బాంబులేస్తామని బెదిరింపులు | China Threatens Japan Attack With Nuclear Weapons For Defending Taiwan | Sakshi
Sakshi News home page

Video: ‘అణ్వాయుధాలతో నామరూపాలు లేకుండా చేస్తాం.. జాగ్రత్త’

Published Tue, Jul 20 2021 11:41 AM | Last Updated on Tue, Jul 20 2021 12:06 PM

China Threatens Japan Attack With Nuclear Weapons For Defending Taiwan - Sakshi

డ్రాగన్‌ కంట్రీ మరోసారి తన తలపొగరును ప్రదర్శించింది. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే న్యూక్లియర్‌ వార్‌ తప్పదని జపాన్‌ను గట్టిగానే హెచ్చరించింది. ఈ మేరకు ఏకంగా కమ్యూనిస్ట్‌ పార్టీ అధికారిక ఛానెల్‌ ఓ వీడియోను ప్రసారం చేసింది.

తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుంటే గనుక ఊరుకునేది లేదని చెబుతూ.. అవసరమైతే అణు ఆయుధాలు ప్రయోగిస్తామని జపాన్‌ను హెచ్చరించింది చైనా. ‘‘తైవాన్‌ విషయంలో కలుగజేసుకున్నందుకు జపాన్‌పై మేం బాంబులు వేస్తాం. ఆ తర్వాత లొంగిపోయామని జపాన్‌ మమ్మల్ని బతిమాలుకునేదాకా రెండోసారి బాంబులేస్తాం. తైవాన్‌ విముక్తి మా చేతుల్లో ఉన్న అంశం. జపాన్‌ జోక్యం సహించే ప్రసక్తే లేదు. జపాన్‌కు సంబంధించి ఒక్క యుద్ధ విమానం, ఒక్క సైనికుడు తైవాన్‌ సరిహద్దులో కనిపించినా ఆ దేశాన్ని(జపాన్‌) నామరూపాల్లేకుండా సర్వనాశం చేస్తామని’ని ఆ వీడియోలో కొందరు సైనికులు మాట్లాడినట్లు ఉంది.

పైగా చైనా అధికారిక ఛానెల్‌ సీసీపీకి సంబంధించిన ఓ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోనే ఈ వీడియో ప్రదర్శితం కావడం విశేషం.  అయితే 2 మిలియన్ల వ్యూస్‌ తర్వాత ఆ వీడియోను ఛానెల్‌ డిలీట్‌ చేయగా.. యూట్యూబ్‌, ట్విటర్‌లో మాత్రం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తైవాన్‌ సార్వభౌమాధికారం-సౌభ్రాతృత్వం కాపాడేందుకు తాము ముందు ఉంటామని జపాన్‌ రెండు వారాల కిందట ప్రకటన చేసింది. బయటి శక్తులు తైవాన్‌పై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తే.. అండగా నిలబడతామని జపాన్‌ డిప్యూటీ పీఎం తారో అసో ప్రకటించారు కూడా.  ఈ పరిణామాల నేపథ్యంలో మిలిటరీ ఫ్యాన్‌ బాయ్స్‌ పేరిట చైనా నుంచి ఈ వీడియో రిలీజ్‌ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement