
సియోల్ : వరుస అణు ప్రయోగాలతో ప్రపంచాన్ని భయపెడుతున్న ఉత్తర కొరియా అంటే.. భయపడాల్సిన అవసరం లేదని దక్షిణ కొరియా ప్రకటించింది. అంతేకాక ఉత్తర కొరియాను చూసి భయపడి కొత్తగా తాము అణుబాంబులను రూపొందించుకోవాల్సిన అవసరం తమకు లేదని దక్షిణ కొరియా తేల్చి చెప్పింది. ప్రపంచాన్ని భయపెట్టే దిశలో ఉత్తర కొరియా చేస్తున్న అణ్వాయుధ ప్రయోగాలను సహించేది లేదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే స్పష్టం చేశారు. ఉత్తర కొరియాలా తామూ అణ్వాయుధాలను సమకూర్చుకోవాల్సిన అవసరం లేదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే.. ఆ దేశ పార్లమెంట్‌కు స్పష్టం చేశారు.
అమెరికాను సైతం మొత్తం ధ్వంసం చేసే అణుబాంబులు.. వాటిని మోసుకెళ్లే క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా భద్రతపై ఆ దేశ పార్లమెంట్‌లో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు మూన్ జే పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. దక్షిణ కొరియా భద్రతపై అమెరికాతో ఒప్పందాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. అణ్వాయుధాల ఉపసంహారంపై 1990లో చేసుకున్న ఒప్పందాలకు దక్షిణ కొరియా కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment