
సాక్షి, ముంబయి : హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు తృటిలో తప్పించుకున్నారు. ముంబయికి సమీపంలోని మీరా రోడ్‌లో గురువారం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్ ఆవరణలో హెలికాఫ్టర్ ల్యాండ్ కావాల్సిఉండగా, అక్కడ వైర్ ఉండటాన్ని గుర్తించిన పైలట్ చాపర్‌ను వెనుకకు మళ్లించాడు. సమీప ప్రాంతంలోని మరో చోట హెలికాఫ్టర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశాడు.
హెలికాఫ్టర్ ప్రమాదాల నుంచి బయటపడటం ఫడ్నవీస్‌కు ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జులైలోనూ ఆయన హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మే 2017లో సీఎం ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లాతూర్‌లో క్రాష్ ల్యాండింగ్ అయింది. అదే నెలలో గడ్చిరోలిలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ సాంకేతిక కారణాలతో టేకాఫ్ తీసుకోవడంలో విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment