ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకొండ సమీపంలో కూలిపోయింది.
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారిలో వై.ఎస్. రాజశేఖరరెడ్డితో పాటు ప్రత్యేక కార్యదర్శి పి. సుబ్రహ్మణ్యం, ముఖ్య భద్రతా అధికారి ఎ.ఎస్.సి.వెస్లీ, పైలట్ ఎస్. కె. భాటియా, సహ పైలట్ ఎం. ఎస్. రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. తమ ప్రియతమ నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది మరణించారు. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు.
ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
- వెలుగులోకి వచ్చిన సత్యం కంప్యూటర్స్ సంస్థ స్కామ్. స్కామ్ నిజమేనని ఆ కంపెనీ సంస్థాపకులు రామలింగరాజు ఒప్పుకోలు.
- లోక్‌సభ తొలి మహిళా స్పీకర్‌గా మీరా కుమార్.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతి తెలుపుతూ ప్రకటన జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.
(చదవండి: ‘రాజద్రోహాన్ని’ లెక్కచేయలేదు, కటకటాలనూ లెక్క చేయలేదు)
Comments
Please login to add a commentAdd a comment