అఖిలేశ్‌కు తృటిలో తప్పిన ముప్పు | akilesh yadav to narrowly missed the threat | Sakshi
Sakshi News home page

అఖిలేశ్‌కు తృటిలో తప్పిన ముప్పు

Published Tue, Apr 29 2014 3:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

అఖిలేశ్‌కు తృటిలో తప్పిన ముప్పు - Sakshi

అఖిలేశ్‌కు తృటిలో తప్పిన ముప్పు

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్‌లు హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొంది. దీంతో దానిని అత్యవసరంగా కిందకు దించాల్సి వచ్చింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. అయితే ఈ విషయాన్ని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. అఖిలేశ్ యాదవ్ కనౌజ్ ఎంపీ అయిన తన సతీమణి డింపుల్‌తో కలసి తన బంధువు రతన్‌సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరై సైఫాయ్ నుంచి హెలికాప్టర్‌లో తిరిగి వస్తుండగా.. దానిని పక్షి ఢీకొందని ఆ వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement