భయ్యా.. భాబీ జిందాబాద్ | in uttara pradesh akhilesh yadav and dimple yadav election campaign | Sakshi
Sakshi News home page

భయ్యా.. భాబీ జిందాబాద్

Published Thu, Apr 24 2014 1:10 AM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

భయ్యా.. భాబీ జిందాబాద్ - Sakshi

భయ్యా.. భాబీ జిందాబాద్

 ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ లోక్‌సభ నియోజకవర్గం ‘భయ్యా.. భాబీ జిందాబాద్’ నినాదాలతో హోరెత్తుతోంది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్(35) ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో భార్యాభర్తలిద్దరూ కలిసి జంటగా ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కలిసే రోడ్ షోలలో, ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ‘అఖిలేశ్ జిందాబాద్’ అనే నినాదాలు ఎక్కువైతే.. ‘మీ భయ్యా గురించే కాదు.. నా గురించి కూడా నినాదాలు చేయండి.. మీ అభ్యర్థిని నేనే’ అంటూ నవ్వుతూ చురకలేస్తున్నారు డింపుల్‌యాదవ్. అయితే, అఖిలేశ్ యాదవ్ తన భార్య విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయంటున్నారు. ‘మీ భార్యపై ప్రేమతో ప్రచారానికొచ్చారా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ తరఫున వచ్చారా?’ అని ప్రశ్నిస్తే.. కాస్త సిగ్గుపడుతూ.. ‘భార్య కోసం ప్రచారం చేయడంలో తప్పేముంది’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement