అఖిలేష్ మంత్రి వర్గం నుంచి 36 మందికి ఉద్వాసన | 36 ministers ouster from Akhilesh Ministry | Sakshi
Sakshi News home page

అఖిలేష్ మంత్రి వర్గం నుంచి 36 మందికి ఉద్వాసన

Published Tue, May 20 2014 3:51 PM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

అఖిలేష్ యాదవ్ - Sakshi

అఖిలేష్ యాదవ్

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ తన మంత్రి వర్గంలోని 36 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. సార్వత్రిక ఎన్నికలలో సవాజ్వాది పార్టీ ఓటమికి ఆ మంత్రులను  బాధ్యులను చేస్తూ  పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో  అధికారంలో ఉన్న పార్టీ చాలా తక్కువ స్థానాలను గెలుచుకుంది.

ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉండగా, 71 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. సమాజ్వాది పార్టీ కేవలం 5 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అప్నాదల్ పార్టీలు చెరో 2 స్థానాలను గెలుచుకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement