మాస్క్: రష్యాలో స్థానిక అధికారులు, వ్యాపారస్థులతో పయనిస్తున్న ఓ హెలికాప్టర్ శనివారం కూలిన ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మొత్తం 19 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎమ్ఐ-8 హెలికాప్టర్ ఆకస్మికంగా ఓ లోయలో కూలిపోయింది. వీరిలో ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు. మూర్ మాంస్క్ కు వాయువ్య దిశలో హెలికాప్టర్ పయనిస్తున్న సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుని ఉండవచ్చని చేసింది. కాగా, ఇందులో గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మిగిలిన వారి ఆచూకీ మాత్రం లభించలేదు.
ఇదిలా ఉండగా ఆ హెలికాప్టర్ లో మొత్తం 18 మంది మాత్రమే ప్రయాణించినట్లు ఆ దేశ అత్యవసర మంత్రిత్వ శాఖ చెబుతుంది. ఏవియేషన్ అధికారుల వైఫల్యం కారణంగానే రష్యాలో తరుచు హెలికాప్టర్ దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మృతి
Published Mon, Jun 2 2014 10:59 AM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM
Advertisement
Advertisement