పుణె: మహారాష్ట్రలోని పుణెలో బుధవారం(అక్టోబర్2) తెల్లవారుజామున హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్‌లతో పాటు ఒక ఇంజినీర్ దుర్మరణం పాలయ్యారు. పుణెజిల్లాలోని బవ్‌ధాన్ కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బవ్‌ధాన్ పరిసర ప్రాంతంలోని గోల్ఫ్‌కోర్స్‌లో ఉన్న హెలిప్యాడ్ నుంచి గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది.
హెలికాప్టర్ ముంబై వెళ్లాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలియనప్పటికీ దట్టమైన పొగమంచు వల్లే హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కుప్పకూలిన హెలికాప్టర్ పుణెలోని హెరిటేజ్ ఏవియేషన్‌కు చెందినదిగా తేల్చారు. కాగా, ముంబై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ హెలికాప్టర్ పుణె సమీపంలో ఇటీవలే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని నలుగురు గాయపడ్డారు.
#WATCH | A #helicopter with three people onboard crashed in the Bavdhan area in #Pune. According to the police, two people have died in the incident.
More details here: https://t.co/34QkwGCcvh pic.twitter.com/v6tQTKz2K1— Hindustan Times (@htTweets) October 2, 2024
ఇదీ చదవండి: పెరోల్‌పై డేరా బాబా విడుదల
Comments
Please login to add a commentAdd a comment