
సాక్షి,సంగారెడ్డిజిల్లా: మహారాష్ట్రలోని పుణె నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు యువకులు అజ్మీర్ దర్గా సందర్శన కోసం వెళ్లారు. దర్గా సందర్శించుకుని తిరిగి వస్తుండగా పుణె శివారులోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, ఖురేషి, రఫిక్, ఫిరోజ్ కురేషి, మజీద్ పటేల్ ప్రమాద స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ అమర్‌ను పుణెలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment