ఒలింపిక్స్‌లో నగ్నంగా డైవింగ్ క్రీడలు?
రి డిజెనీరో: ఒలింపిక్స్‌లో పురుషుల డైవింగ్ ఈవెంట్ చాలా పాపులర్. గాలిలో గింగిరాలు తిరుగుతూ క్రీడాకారులు చేసే అద్ధుమైన డైవింగ్ విన్యాసాలను చూసేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. తాజాగా రియోలో జరిగిన డైవింగ్ ఈవెంట్‌ను కూడా ప్రేక్షకులు చాలామంది కళ్లప్పగించకుండా తిలకించారు.
ఈ ఈవెంట్‌ను తిలకించిన చాలామందికి డైవర్స్ నగ్నంగా పాల్గొన్నారా అనే డౌటు వచ్చింది. కండలు తిరిగిన దేహాలతో ఒంటిపై లోదుస్తులు మాత్రమే ధరించే డైవర్స్ పోటీల్లో పాల్గొనే విషయం తెలిసిందే. అయితే, సరిగ్గా లోదుస్తులు ధరించే ప్రాంతంలోనే వ్యూహాత్మకంగా స్కోరు బోర్డును చానెళ్ల చూపించడంతో.. సదరు ఆటగాళ్లు ఒంటిపై నూలుపోగులేకుండా ఈ పోటీల్లో పాల్గొన్నారా? వారి నగ్నత్వాన్ని కవర్ చేసేందుకే ఆ ప్రాంతంలో స్కోరుబోర్డును ఇచ్చారా? అంటూ పలువురు ట్వీట్లతో సందేహాలు వ్యక్తం చేశారు. వీరికి అమెరికా నటి కిరా కొసారిన్ కూడా వీరికి కోరస్ కలిపింది. 'ఒలింపిక్స్‌లో డైవింగ్ నాకు ఎందుకిష్టమంటే.. టీవీ స్క్రీన్‌లో బాటమ్‌లైన్‌లో చూపించే స్కోరుబోర్డు వల్ల ఆటగాళ్లంతా నగ్నంగా పాల్గొంటున్నట్టు అనిపించి గిలిగింతలు పెడుతుంది' అని ఆమె ట్వీట్ చేసింది.