
వాషింగ్టన్: ప్రతి ఒక్కరు తమ జీవితంలో కొన్నివస్తువులను చాలా అపురూపంగా చూసుకుంటారు. కానీ పొరపాటున ఆ వస్తువును ఎక్కడైనా కోల్పోతే.. ఇంకేమైనా ఉందా? ఎవరు ఓదార్చినా ఆ బాధ తగ్గేది కాదు. కానీ అదే వస్తువు మళ్లీ కళ్లముందు ప్రత్యక్షమైతే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి సంఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. పాపిని అనే వ్యక్తి సరదాగా కాలిఫోర్నియాలోని నదిలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో అతని వేలికున్న వెడ్డింగ్ రింగ్ జారిపోయి నీటిలో పడిపోయింది. పాపం.. దానికోసం ఎంతో వెతికాడు. కానీ ఆ ఉంగరం దొరకలేదు. దీంతో చాలా దిగులు పడ్డాడు. కానీ, ఆ ఉంగరం ఎప్పటికైనా తనకు దొరుకుతే బాగుండని ఆశపడేవాడు.
విడ్డూరంగా అతను మనసులో పెట్టుకున్న నమ్మకమే నిజమైంది. డైపర్ కర్ల్ బ్లే అనే వ్యక్తి అదే నదిలో ఈదుతున్నప్పుడు అతనికి ఒక బంగారు ఉంగరం దొరికింది. దీన్ని అతడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌చేశాడు. ఈ పోస్ట్ చూసిన పాపిని తెగ సంబరపడిపోయి.. వెంటనే కర్ల్ బ్లేను కలిశాడు. ఆ ఉంగరం తన పెళ్లినాటిదని, దాన్ని ఆ నదిలో పోగొట్టుకున్నానని అతడితో చెప్పాడు. ఉంగరాన్ని దొరికిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచున్నందుకు కర్ల్ బ్లేకు ధన్యవాదాలు తెలిపాడు. పొగొట్టుకున్న తన ఉంగరం దొరకడంతో పాపిని ఇప్పటికీ తన కళ్లను తాను నమ్మలేకపోతున్నాడు. కాగా, కర్ల్ బ్లేకి చిన్నప్పటి నుంచి ఈత కొట్టడం అలవాటు. ఈ క్రమంలో నీటిలో ఏదైనా వస్తువు దొరికితే వాటిని సోషల్ మీడియాలో పంచుకొని దాని నిజమైన యజమానికి అవి చేరేలా చూస్తూ ఉంటాడు.
Comments
Please login to add a commentAdd a comment