washignton
-
గ్రహశకలాలకు ‘గాలం’!
గ్రహాలు, గ్రహశకలాలపై అధ్యయనం చేయడం ద్వారా విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, మన భూమి పుట్టుపూర్వోత్తరాల గురించి మరింత బాగా తెలుసుకోవచ్చు. దీనికోసమే గ్రహాలు, గ్రహశకలాల నుంచి మట్టి, శిలల నమూనాలను సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొన్ని ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చంద్రుడు, ఇటోకవా అనే గ్రహశకలం నుంచి మాత్రమే నమూనాలు సేకరించగలిగారు. అంతరిక్షంలో సుదూర తీరాలకు ప్రయాణించి గ్రహాలపై, గ్రహశకలాలపై వ్యోమనౌకలను దింపి అక్కడి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడమన్నది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. క్యూరియాసిటీ లాంటి రోవర్లు గ్రహాలపై దిగి మట్టిని విశ్లేషించి సమాచారం పంపగలిగినా మనిషి నేరుగా చేసే పరీక్షలకు, యంత్రాలు చేసే పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ విషయంలో ఇప్పటిదాకా ఆశించినంత పురోగతి సాధ్యం కాలేదు. అయితే.. గ్రహశకలాలకు ‘గాలం’ వేసి వాటి నుంచి నమూనాలు సేకరించే పనిని సులభం చేసే ఓ అద్భుత స్పేస్ టెక్నాలజీని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన రాబర్ట్ వింగ్లీ బృందం అభివృద్ధిపరుస్తోంది. ఖగోళ వస్తువుల నుంచి నమూనాల సేకరణను కొత్తపుంతలు తొక్కించనుందని భావిస్తున్న ఈ అంతరిక్ష ‘గాలం’ సంగతేంటో ఇప్పుడు చూద్దాం... ఈటెలు రువ్వి... నమూనాలు సేకరించి.. చేపలు పట్టడానికి గాలం ఉపయోగిస్తారు. తిమింగలాలు పట్టేందుకు ఈటెల్లాంటి పెద్ద గాలాన్ని ఉపయోగిస్తారు. కాకపోతే చేపలకు కొక్కెంలాంటి గాలం వేస్తారు. తిమింగలాలకు ఈటెలాంటి హార్పూన్ (తెలుగులో పంట్రకోల, రువ్వుటీటె అంటారు)లను యంత్రాల సాయంతో వేగంగా వదులుతారు. ముందు భాగం బాణంలా ఉండే ఈ హార్పూన్ తిమింగలాల శరీరంలోకి దిగిన తర్వాత చిక్కుకుపోతుంది. దీంతో హార్పూన్‌ను బలమైన తాడుతో మోటార్ల సాయంతో వెనక్కి లాగుతూ తిమింగలాలను ఓడ దగ్గరికి తీసుకొస్తారు. మరి ఈ ఐడియాను అంతరిక్షంలో ఎలా ఉపయోగిస్తారనే విషయానికొస్తే రాకెట్ మాదిరిగా మొనదేలిన కవచంతో ఉన్న హార్పూన్లను వ్యోమనౌకల ద్వారా పంపుతారు. హార్పూన్‌ను వ్యోమనౌకకు మైళ్లకొద్ది పొడవుండే దృఢమైన తాడుతో కడతారు. చంద్రుడు లేదా ఓ గ్రహ శకలం సమీపంలోకి వ్యోమనౌక వెళ్లిన తర్వాత హార్పూన్ బలంగా విడుదలవుతుంది. దీంతో సెకనుకు ఒక కి.మీ. వేగంతో హార్పూన్ దూసుకుపోయి ఆ ఖగోళ వస్తువు ఉపరితలంలోకి దిగబడిపోతుంది. హార్పూన్ నేలలోకి దిగిపోగానే దాని కవచం విడిపోతుంది. ఇంకేం.. లోపల ఉండే డబ్బాలోకి కొన్ని కిలోల వరకూ మట్టి, రాళ్లు చేరిపోతాయి. శాంపిల్‌తో కూడిన హార్పూన్‌ను తాడు సాయంతో వ్యోమనౌక వెనక్కి లాక్కుని భూమికి తిరిగి వచ్చేస్తుందన్నమాట. నాసా శాస్త్రవేత్తలు ఈ స్పేస్ హార్పూన్ని బ్లాక్‌రాక్ ఎడారిలో ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షంలోనూ హార్పూన్ల ప్రయోగానికి వీరు సిద్ధమవుతున్నారు. ప్రయోజనాలు చాలానే... స్పేస్ హార్పూన్లతో గ్రహశకలంపై వేర్వేరు చోట్ల శాంపిళ్లను సేకరించవచ్చు. వ్యోమనౌకను దింపాల్సిన అవసరం లేనందున ఇంధనం బాగా ఆదా అవుతుంది. గ్రహాల ఉపరితలంపై కొన్ని మీటర్ల లోతు నుంచీ నమూనాలు సేకరించొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా.. విఫలమైన ఉపగ్రహాలకు చెందిన శకలాలు ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, మనం పంపే ఉపగ్రహాలకు ముప్పు తెస్తున్నాయి. అలాంటి శకలాలపైకి హార్పూన్లను వదిలి, అవి గుచ్చుకున్నాక.. శకలాలను భూవాతావరణంలోకి ఈడ్చుకొచ్చి మండించొచ్చని అంటున్నారు. అలాగే.. భూమిపై అగ్నిపర్వతాల బిలాల నుంచి, అణు ప్రమాదాలు జరిగి రేడియోధార్మికత తీవ్రంగా ఉన్న చోటు నుంచి, ఇతర ప్రతికూలమైన ప్రదేశాల్లో ఆకాశం నుంచే శాంపిళ్లను సేకరించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: 2023లో ఎవరెస్టును ఎందరు అధిరోహించారు? సరికొత్త రికార్డు ఏమిటి? -
రహస్య భూగర్భ రైలు మార్గం: ఎక్కడ ఉందో, దాని చరిత్ర ఏంటో తెలుసా?
పూర్వం రాజులు శత్రు రాజులు తమ పై దండయాత్ర చేసినప్పుడు తప్పించుకోవడానికి లేదా ఒక వేళ యుద్ధంలో తాను ఓడిపోతే తన పరివారాన్ని రక్షించుకోవటం కోసం కోటలో ప్రత్యేకంగా భూగర్భ మార్గం(సోరంగం) కచ్చితంగా ఏర్పాటై ఉండేవి. వాటి సాయంతో తప్పించుకోవటం వంటివి చేసేవారు. లేదా రాజు రహస్యంగా దేశ సంచారం చేయాలనుకున్న ఆ రహస్య మార్గం గుండా వచ్చేవారు. ఎవ్వరికి తెలియనచ్చేవారు కాదు. అచ్చం అదేవిధంగా వాషింగ్టన్లో రహస్య భూగర్భ మార్గం ఉంది. కాకపోతే అది సొరంగాలా కాకుండా భూగర్భ రైలు మార్గం(సబ్వే). అసలు అది ఎక్కడ ఉంది దాని చరిత్ర ఏంటో తెలుకుందాం రండి వాషింగ్టన్: వాషింగ్టన్లో ఉన్న ఈ రహస్య భూగర్భ రైలు(సబ్వే) మార్గం గుండా ప్రముఖులు, సుప్రీం కోర్టు జడ్జీలు, ప్రముఖ బాలీవుడ్ ప్రయాణించేవారట. పైగా విశేషమేమిటంటే చాలామంది అమెరికన్లకు కూడా ఈ సబ్వే ఒకటి ఉందని తెలుసుంటున్నారు చరిత్రకారులు. ఒక రకంగా చెప్పాలంటే ఈ భూగర్భ రైలు యునైటెడ్ స్టేట్స్ సెనేట్ ప్రతినిధుల సమావేశమయ్యే వాషింగ్టన్ శ్వేత సౌధంలా ఉంటుందంటున్నారు. మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన లైట్ల వెలుగులో అత్యంత క్లిష్టతరమైన గందరగోళ మార్గం, పైగా ఈ మార్గంలోకి వెళ్లంగానే బయట ఏం జరుగుతోందో కూడా మనకు తెలయదని సెనేట్ హిస్టారికల్ ఆఫీస్‌లోని సహాయక చరిత్రకారుడు హిస్టారియన్ డాన్ హోల్ట్ చెబుతున్నారు. ఒక శతాబ్దానికి పైగా రాజకీయ నాయకులు ఈ సబ్వేని ఉపయోగించారని చెబుతున్నారు. సెనెటర్లు, ప్రముఖులు ఎక్కువగా తమ కుటుంబాలతో వచ్చి గడిపేవారని, పైగా ప్రముఖుల పిల్లలు ఈ రైలులో ప్రయాణించడానికీ ఎకువగా ఇష్టపడేవారని అన్నారు. చరిత్రకారుడు హోల్ట్ ఈ రైలు ఏదో ప్రత్యేకత ఉందంటున్నారు. ఈ భూగర్భ మార్గం మూడే వేల అడుగుల లోతులో ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు సెనెటర్లు విలేకర్లు సమావేశం, రాజకీయ చర్చలు, పుకార్లతో విసిగిన అధికారులకు ఈ మార్గం గుండా ప్రయాణమనేది వారికీ అత్యంత నిశబ్దంతో కూడిన ప్రశాంతమైన జర్నీలా ఉంటుందని పేర్కొన్నారు. (చదవండి: చిప్సెట్ల కొరత.. చైనాకు చెక్ పెట్టేలా ఇండియా ప్లాన్ !) అలుముకున్న కొన్ని వివాదాలు .. ఇక్కడ ఒక మాజీ పోలీస్ అధికారి విలియమ్ కైసర్ అప్పటి అధ్యక్షుడి జాన్ బ్రిక్కర్ పై కాల్పులు జరిపాడని చెప్పారు. అంతే కాక అమెరికా 27వ అధ్యక్షుడు హోవార్డ్ టాఫ్ట్ ఇక్కడే అదృశ్యమైనట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిందన్నారు. దీంతో ప్రస్తుతం సెనెటర్లకు ఈ మార్గం అంటేనే భయంగలిగించే విధంగా అయ్యిందని ప్రస్తుతం ఈ మార్గాన్ని వినయోగించటం లేదని పేర్కొన్నారు. ఎప్పుడు ప్రారంభించారంటే...... ఈ భూగర్భ రైలు మార్గం మార్చి 7, 1990లో ప్రారంభమైంది. వాషింగ్టన్‌లోని తమ కార్యాలయాలకు వెళ్లడానికీ ఈ మార్గాన్ని వినియోగించేవారు. ఈ తర్వాత కాలంలో 1960లో 75 వేల డాలర్లలతో ఎలక్ట్రిక్ మోనో రైలులో రూపోందించారు. ప్రతినిధుల సమావేశాలు కూడా జరుపుకునే ఆఫీస్ కార్యాలయంలా అత్యధునిక టెక్నాలజీతో ఆ రైలుని రూపొందించారు. తదనంతరం 1993లో 18 వేల డాలర్లతో డిస్నీ ల్యాండ్ తరహా డ్రైవర్ లెస్ రైలును సరికొత్త హంగులతో ఆవిష్కిరించారు. కానీ కాలక్రమంలో అత్యధునిక టెక్నాలజీతో రూపాంతరం చెందుతున్న ఈ భూగర్భ రైలు(సబ్వే)ను చాలా మంది సెనెటర్లు అంతగా ఇష్టపడలేదనేది చారిత్రకారుల అభిప్రాయం. ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటు ఫిర్యాదులు వచ్చాయని చరిత్రకారులు అంటున్నారు. హమిల్లన్ అనే మ్యూజికల్ అల్బమ్ సృష్టి కర్త లిన్-మాన్యువల్ మిరాండా 2017లో అవార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఈ మార్గం గుండా రైడ్ చేయాలనుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు. దీంతో ఈ భూగర్భ రైలు మార్గం వార్తల్లో నిలివడమే కాక ప్రజల్లో చర్చలకు తెరలేపింది. ఏది ఏమైనప్పటికీ ఈ భూగర్భ రైలు మార్గం(సబ్వే) ప్రముఖులను ఉద్దేశించి ఆవిష్కరించినదే అయినా కొన్ని వివాదాల కారణంగా శతాబ్దాలకు పైగా రాజకీయ నాయకులు ఉపయోగించిన అత్యాధునిక టెక్నాలజీతో కూడిన చారిత్రక రహస్య భూగర్భ రైలుగా మిగిలిపోయిందని సహాయక చరిత్రకారుడు హోల్ట్ అభివర్ణించారు. (చదవండి: భయంకరమైన బావి.. నరక కూప మర్మం చేధించిన సాహసికులు) -
న్యూయార్క్‌లో ఇడా తుపాను బీభత్సం
వాషింగ్టన్: న్యూయార్క్‌లో ఇడా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను బీభత్సానికి ఏడుగురు మృతి చెందారు. న్యూయార్క్‌లో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పలు విమానాలను ప్రభుత్వం రద్దు చేసింది. కాగా ఇడా తుపానుతో అమెరికాలోని న్యూయార్క్‌లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అండర్‌పాస్ వంతెనలు, రైల్వే స్టేషన్లు సబ్‌వేల్లోకి భారీగా నీరు చేరింది. చదవండి: Talibans: తాలిబన్లతో భారత రాయబారి చర్చలు రహదారులపై వరద పొంగిపొర్లుతోంది. అనేక ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి మోకాలిలోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రో రవాణాను నిలిపివేశారు. తుపాను కారణంగా ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ కేటీ హోచుల్ తెలిపారు. అటు పొరుగున ఉన్న న్యూజెర్సీలో కూడా అత్యవసర స్థితిని ప్రకటించారు. చదవండి: యూట్యూబర్ వెంటపడ్డ పాము.. కారణం అదేనంటూ వైరల్ -
US: భారత్‌కు సాయం కొనసాగుతుంది
వాషింగ్టన్: కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న వేళ అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు అండగా నిలుస్తామని పునరుద్ఘాటించింది. భారత్‌కు అందిస్తున్న తాము అందిస్తున్న సాయం ఇకపై కూడా కొనసాగుతుందని శ్వేతసౌధం ప్రెస్ కార్యదర్శి జెన్‌సాకి తెలిపారు. వైట్‌హౌస్‌లో జరిగే రోజువారీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా జెన్‌సాకి ఈ విషయం చెప్పారు. భారత్‌కు 100 మిలియన్ డాలర్ల విలువైన మెడికల్ సాయాన్ని అందిస్తామని బైడెన్ ప్రకటించారన్నారు. ఇప్పటికే ఏడు విమానాల ద్వారా భారత్‌కు సాయం పంపినట్లు గుర్తు చేశారు. అందులో ఏడో షిప్మెంట్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉన్నట్లు వెల్లడించారు. కరోనాతో పోరాడుతున్న భారతీయులకు అవి ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ సాయం కొనసాగుతుందని చెప్పారు. భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని కితాబిచ్చారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాణాత్మక సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. అందుకు ప్రస్తుతం తాము అందిస్తున్న మెడికల్‌సాయం ఉపయోగపడుతుందన్నారు. కరోనా కేసులు, మరణాలు తగ్గేందుకు అవి సాయం చేస్తాయన్నారు. (చదవండి: బైడెన్ దంపతుల ఆదాయమెంతో తెలుసా?) -
విచిత్రం: పోయిందనుకున్న బంగారు ఉంగరం దొరికింది!
వాషింగ్టన్: ప్రతి ఒక్కరు తమ జీవితంలో కొన్నివస్తువులను చాలా అపురూపంగా చూసుకుంటారు. కానీ పొరపాటున ఆ వస్తువును ఎక్కడైనా కోల్పోతే.. ఇంకేమైనా ఉందా? ఎవరు ఓదార్చినా ఆ బాధ తగ్గేది కాదు. కానీ అదే వస్తువు మళ్లీ కళ్లముందు ప్రత్యక్షమైతే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి సంఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. పాపిని అనే వ్యక్తి సరదాగా కాలిఫోర్నియాలోని నదిలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో అతని వేలికున్న వెడ్డింగ్ రింగ్ జారిపోయి నీటిలో పడిపోయింది. పాపం.. దానికోసం ఎంతో వెతికాడు. కానీ ఆ ఉంగరం దొరకలేదు. దీంతో చాలా దిగులు పడ్డాడు. కానీ, ఆ ఉంగరం ఎప్పటికైనా తనకు దొరుకుతే బాగుండని ఆశపడేవాడు. విడ్డూరంగా అతను మనసులో పెట్టుకున్న నమ్మకమే నిజమైంది. డైపర్ కర్ల్ బ్లే అనే వ్యక్తి అదే నదిలో ఈదుతున్నప్పుడు అతనికి ఒక బంగారు ఉంగరం దొరికింది. దీన్ని అతడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్చేశాడు. ఈ పోస్ట్ చూసిన పాపిని తెగ సంబరపడిపోయి.. వెంటనే కర్ల్ బ్లేను కలిశాడు. ఆ ఉంగరం తన పెళ్లినాటిదని, దాన్ని ఆ నదిలో పోగొట్టుకున్నానని అతడితో చెప్పాడు. ఉంగరాన్ని దొరికిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచున్నందుకు కర్ల్ బ్లేకు ధన్యవాదాలు తెలిపాడు. పొగొట్టుకున్న తన ఉంగరం దొరకడంతో పాపిని ఇప్పటికీ తన కళ్లను తాను నమ్మలేకపోతున్నాడు. కాగా, కర్ల్ బ్లేకి చిన్నప్పటి నుంచి ఈత కొట్టడం అలవాటు. ఈ క్రమంలో నీటిలో ఏదైనా వస్తువు దొరికితే వాటిని సోషల్ మీడియాలో పంచుకొని దాని నిజమైన యజమానికి అవి చేరేలా చూస్తూ ఉంటాడు. -
సొంత ప్రాంతం వీడుతూ జో బైడెన్ భావోద్వేగం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్ బుధవారం వాషింగ్టన్ బయల్దేరారు. అమెరికాలోని డెలావర్ నుంచి వాషింగ్టన్కు పయనమయ్యారు. అంతకుముందు డెలావర్‌లోని విల్మింగ్టన్లో ఆయనకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సభలో జో బైడెన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "నా చివరి శ్వాస వరకు డెలావర్ ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటుంది. నేను ఇక్కడ లేకపోవడం నన్ను బాధిస్తున్న.. మీరు నన్ను ఇక్కడి నుంచి అధ్యక్షుడిని చేసి పంపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు. కరోనాతో మరణించిన వారికి మంగళవారం రాత్రి బైడెన్ దంపతులతో పాటు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారీస్ దంపతులు నివాళులర్పించారు. 4 లక్షల మంది అమెరికా పౌరులను కరోనా వలన కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బైడెన్ ప్రమాణానికి వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ భవనం ముస్తాబైంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ బుధవారం రాత్రి 10.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికా సుప్రీంకోర్టు సీజే జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే బైడెన్ కంటే ముందు ఉపాధ్యక్షురాలు కమలాదేవి హ్యారిస్ ప్రమాణస్వీకారం చేస్తారు. -
కాపిటల్ హిల్ ఘటన : టెక్ దిగ్గజాల స్పందన
వాషింగ్టన్: అమెరికా తాజా అల్లర్లపై అమెరికాకుచెందిన ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు. కాపిటల్ హిల్‌లో హింసను ప్రజాస్వామ్య విరుద్ధ ఘటనగా అభివర్ణించారు. బుధవారం జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ సుందర్ పిచాయ్ తనఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించారు. కంపెనీ తన ఉద్యోగులతో టచ్‌లో ఉందని, ఏదైనా అదనపు ముందు జాగ్రత్త చర్యలు అవసరమైతే ఉద్యోగులను అప్డేట్ చేస్తామని సీఈఓ తెలిపారు. అటు క్యాపిటల్ భవనంపై దాడిని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా తీవ్రంగా ఖండించారు. ఇది విచారకరమైన, సిగ్గుపడాల్సిన రోజు అని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ పరిపాలనకు సంబంధించిన పరివర్తనను పూర్తి చేయాలి అంటూ టిమ్ కుక్ ట్వీట్ చేశారు.(ట్రంప్ మద్దతుదారుల వీరంగం.. కాల్పులు) స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం, మన విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ప్రజాస్వామ్య పనితీరుకు పునాది అని పేర్కొన్న పిచాయ్ దేశ చరిత్రలోనే ఈ హింసను ఖండిస్తున్నామని, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోకారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలను జోబైడెన్ తీసుకునే కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేయాలని కోరారు. కాగా అధ్యక్ష రేసులో జో బైడెన్ విజయానికి నిరసనగా "మార్చి ఫర్ ట్రంప్" పేరుతో ర్యాలీ నిర్వహించిన ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై విరుచుకుపడ్డారు. వీరు సృష్టించిన బీభత్సం, అల్లర్లతో అమెరికాలోని వాషింగ్టన్ అట్టుడికింది. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ఈ విషాదంపై యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. Today marks a sad and shameful chapter in our nation’s history. Those responsible for this insurrection should be held to account, and we must complete the transition to President-elect Biden’s administration. It’s especially when they are challenged that our ideals matter most. — Tim Cook (@tim_cook) January 7, 2021 -
మెలానియా ట్రంప్ ఇంటి చూపులు..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తన మొండి వైఖరిని వీడటం లేదు. జో బైడెన్ ఎన్నికను ఒప్పుకోవటం లేదు. కానీ, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. వైట్‌హౌస్‌ను వదిలి ఇంటికి వెళ్లిపోవాలనుకుంటున్నారామె. వైట్‌హౌస్‌ను వీడిన తర్వాతి పరిస్థితుల గురించి గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. వాషింగ్టన్‌నుంచి మార్-ఎ-లగోకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత సామాగ్రిని తరలించటానికి ప్రయత్నిస్తున్నారంట. 14 ఏళ్ల కుమారుడు బ్యారన్‌తో ఆమె మార్-ఎ-లగోకు వెళ్లిపోనున్నారు. ఈ నేపథ్యంలో తల్లిగా, భార్యగా, అమెరికా ప్రథమ మహిళగా తన బాధ్యతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ( వ్యాక్సిన్ మొదట మాకే కావాలి : ట్రంప్ ) కాగా, డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడిన తర్వాత మెలానియా ఆయనతో విడాకులు తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్- మెలానియా మధ్య భార్యాభర్తల బంధం లేదని, అవసరం కోసమే కలిసి ఉంటున్నారంటూ గతంలో ఒమరోసా సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్.. ఆమెకు భరణం కింద దాదాపు 500 కోట్ల రూపాయలు చెల్లించనున్నారని ఆమె తెలిపారు. -
వైరల్‌గా మారిన సూర్యుడి వీడియో..
వాషింగ్టన్ : ‘నాసా గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్’ సూర్యునికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. నాసా గొడ్డార్డ్ అధికారిక యూట్యూబ్ ఖాతాలో గురువారం విడుదలైన ఈ వీడియో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. పది సంవత్సరాల కాలంలో సూర్యుడిలో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించిన వీడియో ఇది. పదేళ్లలో తీసిన దాదాపు 425 మిలియన్ల హై రెజల్యూషన్ చిత్రాలను దాదాపు గంట నిడివి ఉండే వీడియోగా రూపొందించారు. సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలు, చోటు చేసుకున్న మార్పులను ఓ క్రమానుసారంగా వీడియోలో పొందుపరిచారు. పదేళ్లలో ఈ ఫొటోలను తీయటానికి దాదాపు 20 మిలియన్ గిగాబైట్ల డేటా ఖర్చయింది. ( సూర్యుడు కూడా ‘లాక్డౌన్’!) ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 6.7లక్షల వ్యూస్‌ను.. 7,800 లైక్స్, 450 కామెంట్లు సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వీడియో అద్భుతంగా ఉంది... దీన్ని చూస్తున్నపుడు నాకు తెలియకుండానే నా పెదవులపైకి చిరునవ్వు వచ్చింది... ఈ పదేళ్లలో సూర్యుడిలో మంటలు పెరగటం గమనించవచ్చు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( నింగిలోకి సోలార్ ఆర్బిటర్) -
మార్స్‌పైకి మనిషి..!
వాషింగ్టన్ : మార్స్ గ్రహంపై మనిషి జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉందేమోనని చాలా ఏళ్లుగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రోవర్లను పంపి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తోంది. అయితే మొట్టమొదటిసారిగా మార్స్ మీదకు మనిషిని పంపే యోచనలో ఉన్నారు. అదీ కూడా ఓ మహిళ కావడం విశేషం. అన్నీ సవ్యంగా జరిగితే మార్స్ మీద తొలి అడుగు వేసేది మహిళేనని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్స్టైన్ వెల్లడించారు. సైన్స్ ఫ్రైడే అనే ఒక రేడియో టాక్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ఎవరిని మార్స్ మీదకు పంపించాలో నిర్ణయించలేదని, భవిష్యత్తులో నాసా చేపట్టే కార్యక్రమాల్లో పాల్గోనే మహిళనే పంపించే అవకాశం ఉందన్నారు. మూన్ మీదకు కూడా మహిళను పంపిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా ... ఆయన తప్పకుండా మూన్ మీదకు వెళ్లే రెండో వ్యక్తి మహిళే అవుతారన్నారు. మార్చి నెల జాతీయ ఉమెన్స్ నెలగా పరిగణిస్తున్నాం. ఈ సందర్భంగా మహిళా వ్యోమగాములు స్పేస్‌వాక్ చేయనున్నారని, ఈ నెలాఖరునాటికి మహిళల స్పేస్‌వాక్ పూర్తవుతుందని తెలిపారు. దీనిలో భాగంగా ఇద్దరు వ్యోమగాములు స్పేస్ చుట్టూ తిరుగుతారని జిమ్ పేర్కొన్నారు. -
కాలును వెనక్కితిప్పి అతికించారు!
వాషింగ్టన్ : ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో ఓ బాలుడి విషయంలో కూడా వైద్యులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఏమిలియా ఎల్డర్ అనే బాలుడికి ఏడేళ్ల వయసులోనే ఆస్టియో సర్కోమా అనే అరుదైన క్యాన్సర్ సోకింది. దీంతో .. అప్పటిదాకా అందరి పిల్లల్లా ఆడిపాడే ఎల్డర్ జీవితం ఒక్కసారిగా ‘తిరగబడింది’. మోకాలికి, తుంటికి మధ్య ఓ కణితి ఏర్పడింది. దీనివల్ల విపరీతమైన నొప్పి, వాపు రావడంతో ఎల్డర్ తల్లిదండ్రులు అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో కణితి కారణంగా అక్కడి ఎముక విరిగిపోయిందని వైద్యులు గుర్తించారు. కణితిని తొలగించేందుకు కీమోథెరపీ వంటి చికిత్స విధానాలతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కణితి ఉన్నంత మేర ఎముకను, కాలిభాగాన్ని తొలగించాలని వైద్యులు చెప్పారు. లేదంటే క్యాన్సర్ మిగతా అవయవాలకు వ్యాపించే అవకాశముందని హెచ్చరిచారు. దీంతో ఆ భాగాన్ని తొలగించేందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో.. తొలగించిన వైద్యులు, దానిని అతికించడానికి మాత్రం ‘రొటేషన్ప్లాస్టీ’ పద్ధతిని ఉపయోగించాల్సి వచ్చింది. మరే ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే ఈ పద్ధతిలో కాలును తిప్పి అతికించామని, ప్రయత్నిస్తే భవిష్యత్తులో సాధారణంగానే నడవడం, డ్యాన్స్ వంటివి కూడా చేయొచ్చని చెబుతున్నారు. మొత్తానికి కాలు సంగతి ఎలా ఉన్నా తమ బిడ్డ ప్రాణాలు దక్కినందుకు ఎల్డర్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. -
విమాన ప్రమాదంలో ముగ్గురి మృతి
వాషింగ్టన్ : విమాన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన సంఘటన అమెరికాలోని ఇండియానా రాష్ట్రం మిడ్వెస్ర్టన్లో జరిగింది. విమానం మిస్సౌరీలోని కాన్సాన్ నగరం నుంచి మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈఘటనలో ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ శునకం కూడా చనిపోయింది. మరో శునకం అదృష్టవశాత్తూ గాయాలతో బయటపడింది. ఆ శునకాన్ని పోలీసు అధికారులు దగ్గరలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలను పోలీసు అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రమాదానికి గురైన విమానానికి ఒక ఇంజిన్ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. -
ఏప్రిల్ 1 నుంచి హెచ్-1బి వీసాలకు దరఖాస్తుల స్వీకరణ
వాషింగ్టన్: అమెరికా ఈ ఏడాది 65వేల హెచ్-1బి వీసాలు జారీ చేయనుంది. ఈ వీసాల కోసం ఏప్రిల్1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 28న అర్హులైనవారిని గుర్తిస్తారు. అమెరికాలో ఉండే విదేశీ వృత్తి నిపుణులకు హెచ్1బీ వీసాలు జారీ చేస్తారు. సెనేట్ ఇమ్మిగ్రేషన్ పథకం ప్రకారం యూఎస్ ప్రభుత్వం జారీ చేసే హెచ్1బీ వీసాల సంఖ్య రెట్టింపు అయింది. ప్రస్తుతం ఏడాదికి 65వేల వరకూ హెచ్1బీ వీసాలు జారీ చేస్తున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు సంబంధించి భారత దేశం ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో ఉంది. కొత్తగా జారీ చేసే ఈ వీసాల వల్ల భారతీయ నిపుణులకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఆకట్టుకునేందుకు 1990లో హెచ్1బీ వీసాల జారీ చేయడం మొదలు పెట్టారు. అయితే ఔట్సోర్సింగ్ సంస్థలు తక్కువ జీతాలతో ఉద్యోగులను అమెరికాకు తీసుకువచ్చేందుకు వీటిని బాగా వినియోగించుకుంటూ ఉంటాయి. హెచ్-1బి వీసాలను ఈ విధంగా వినియోగించుకునే సంస్థలలో అమెరికాలో తమ కార్యకలాపాలను నిర్వహించే భారతీయ ఐటి కంపెనీలే ఎక్కువగా ఉంటాయి. -
నీలికాంతితో చురుకుదనం!
వాషింగ్టన్: నీలికాంతిలో ఎక్కువ సేపు గడపడం వల్ల మెదడు మహా చురుగ్గా పనిచేస్తుందట. రాత్రీ, పగలూ తేడా లేకుండా ఎప్పుడైనా సరే.. నీలికాంతిలో ఉంటే నిద్రమత్తు తక్కువగా ఉండటంతోపాటు చేసే పనిపై ఏకాగ్రతా పెరుగుతుందట. తక్కువ తరంగదైర్ఘ్యం గల నీలికాంతితో 16 మందిపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు తెలిశాయని అమెరికాలోని బ్రిఘామ్ అండ్ వుమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు వెల్లడించారు. వలంటీర్లను రోజూ ఆరున్నర గంటలపాటు నీలికాంతి ప్రసరిస్తున్న గదిలో ఉంచి కొన్ని పరీక్షలు పెట్టారు. అదేసమయంలో ఎలక్ట్రోడ్ల సాయంతో వారి మెదడు ఎంత చురుకుగా పనిచేస్తోంది? నిద్రమత్తు ఎంత ఉంది? వంటి అంశాలను పరిశీలించారు. తర్వాత ఫలితాలను విశ్లేషించగా.. ఆకుపచ్చకాంతి వంటి ఇతర కాంతుల కన్నా నీలికాంతిలోనే మెదడు బాగా చురుగ్గా ఉంటున్నట్లు తేలింది. దీంతో పనిచేసే చోట నీలికాంతి బల్బులు అమరిస్తే.. ఉద్యోగులు అలసట నుంచి త్వరగా తేరుకుంటారని, రాత్రివేళల్లోనూ బాగా పనిచేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.