వాషింగ్టన్ : ‘నాసా గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్’ సూర్యునికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. నాసా గొడ్డార్డ్ అధికారిక యూట్యూబ్ ఖాతాలో గురువారం విడుదలైన ఈ వీడియో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. పది సంవత్సరాల కాలంలో సూర్యుడిలో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించిన వీడియో ఇది. పదేళ్లలో తీసిన దాదాపు 425 మిలియన్ల హై రెజల్యూషన్ చిత్రాలను దాదాపు గంట నిడివి ఉండే వీడియోగా రూపొందించారు. సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలు, చోటు చేసుకున్న మార్పులను ఓ క్రమానుసారంగా వీడియోలో పొందుపరిచారు. పదేళ్లలో ఈ ఫొటోలను తీయటానికి దాదాపు 20 మిలియన్ గిగాబైట్ల డేటా ఖర్చయింది. ( సూర్యుడు కూడా ‘లాక్‌డౌన్’!)
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 6.7లక్షల వ్యూస్‌ను.. 7,800 లైక్స్, 450 కామెంట్లు సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వీడియో అద్భుతంగా ఉంది... దీన్ని చూస్తున్నపుడు నాకు తెలియకుండానే నా పెదవులపైకి చిరునవ్వు వచ్చింది... ఈ పదేళ్లలో సూర్యుడిలో మంటలు పెరగటం గమనించవచ్చు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( నింగిలోకి సోలార్ ఆర్బిటర్)
Comments
Please login to add a commentAdd a comment