ఎల్డర్
వాషింగ్టన్ : ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో ఓ బాలుడి విషయంలో కూడా వైద్యులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఏమిలియా ఎల్డర్ అనే బాలుడికి ఏడేళ్ల వయసులోనే ఆస్టియో సర్కోమా అనే అరుదైన క్యాన్సర్ సోకింది. దీంతో .. అప్పటిదాకా అందరి పిల్లల్లా ఆడిపాడే ఎల్డర్ జీవితం ఒక్కసారిగా ‘తిరగబడింది’. మోకాలికి, తుంటికి మధ్య ఓ కణితి ఏర్పడింది.
దీనివల్ల విపరీతమైన నొప్పి, వాపు రావడంతో ఎల్డర్ తల్లిదండ్రులు అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో కణితి కారణంగా అక్కడి ఎముక విరిగిపోయిందని వైద్యులు గుర్తించారు. కణితిని తొలగించేందుకు కీమోథెరపీ వంటి చికిత్స విధానాలతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కణితి ఉన్నంత మేర ఎముకను, కాలిభాగాన్ని తొలగించాలని వైద్యులు చెప్పారు. లేదంటే క్యాన్సర్ మిగతా అవయవాలకు వ్యాపించే అవకాశముందని హెచ్చరిచారు.
దీంతో ఆ భాగాన్ని తొలగించేందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో.. తొలగించిన వైద్యులు, దానిని అతికించడానికి మాత్రం ‘రొటేషన్‌ప్లాస్టీ’ పద్ధతిని ఉపయోగించాల్సి వచ్చింది. మరే ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే ఈ పద్ధతిలో కాలును తిప్పి అతికించామని, ప్రయత్నిస్తే భవిష్యత్తులో సాధారణంగానే నడవడం, డ్యాన్స్ వంటివి కూడా చేయొచ్చని చెబుతున్నారు. మొత్తానికి కాలు సంగతి ఎలా ఉన్నా తమ బిడ్డ ప్రాణాలు దక్కినందుకు ఎల్డర్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment