వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తన మొండి వైఖరిని వీడటం లేదు. జో బైడెన్ ఎన్నికను ఒప్పుకోవటం లేదు. కానీ, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. వైట్‌హౌస్‌ను వదిలి ఇంటికి వెళ్లిపోవాలనుకుంటున్నారామె. వైట్‌హౌస్‌ను వీడిన తర్వాతి పరిస్థితుల గురించి గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. వాషింగ్టన్‌నుంచి మార్-ఎ-లగోకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత సామాగ్రిని తరలించటానికి ప్రయత్నిస్తున్నారంట. 14 ఏళ్ల కుమారుడు బ్యారన్‌తో ఆమె మార్-ఎ-లగోకు వెళ్లిపోనున్నారు. ఈ నేపథ్యంలో తల్లిగా, భార్యగా, అమెరికా ప్రథమ మహిళగా తన బాధ్యతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ( వ్యాక్సిన్ మొదట మాకే కావాలి : ట్రంప్ )
కాగా, డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడిన తర్వాత మెలానియా ఆయనతో విడాకులు తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్- మెలానియా మధ్య భార్యాభర్తల బంధం లేదని, అవసరం కోసమే కలిసి ఉంటున్నారంటూ గతంలో ఒమరోసా సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్.. ఆమెకు భరణం కింద దాదాపు 500 కోట్ల రూపాయలు చెల్లించనున్నారని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment