వాషింగ్టన్: అమెరికా తాజా అల్లర్లపై అమెరికాకుచెందిన ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు. కాపిటల్ హిల్‌లో హింసను ప్రజాస్వామ్య విరుద్ధ ఘటనగా అభివర్ణించారు. బుధవారం జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ సుందర్ పిచాయ్ తనఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించారు. కంపెనీ తన ఉద్యోగులతో టచ్‌లో ఉందని, ఏదైనా అదనపు ముందు జాగ్రత్త చర్యలు అవసరమైతే ఉద్యోగులను అప్‌డేట్ చేస్తామని సీఈఓ తెలిపారు. అటు క్యాపిటల్ భవనంపై దాడిని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా తీవ్రంగా ఖండించారు. ఇది విచారకరమైన, సిగ్గుపడాల్సిన రోజు అని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ పరిపాలనకు సంబంధించిన పరివర్తనను పూర్తి చేయాలి అంటూ టిమ్ కుక్ ట్వీట్ చేశారు.(ట్రంప్ మద్దతుదారుల వీరంగం.. కాల్పులు)
స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం, మన విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ప్రజాస్వామ్య పనితీరుకు పునాది అని పేర్కొన్న పిచాయ్ దేశ చరిత్రలోనే ఈ హింసను ఖండిస్తున్నామని, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోకారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలను జోబైడెన్ తీసుకునే కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేయాలని కోరారు. కాగా అధ్యక్ష రేసులో జో బైడెన్ విజయానికి నిరసనగా "మార్చి ఫర్ ట్రంప్" పేరుతో ర్యాలీ నిర్వహించిన ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై విరుచుకుపడ్డారు. వీరు సృష్టించిన బీభత్సం, అల్లర్లతో అమెరికాలోని వాషింగ్టన్ అట్టుడికింది. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ఈ విషాదంపై యావత్ ప్రపంచం నివ్వెరపోయింది.
Today marks a sad and shameful chapter in our nation’s history. Those responsible for this insurrection should be held to account, and we must complete the transition to President-elect Biden’s administration. It’s especially when they are challenged that our ideals matter most.
— Tim Cook (@tim_cook) January 7, 2021
Comments
Please login to add a commentAdd a comment