దొమ్మేటిపేట వద్ద కల్వర్టులో బోల్తాపడిన మారుతీకారు
తూర్పుగోదావరి, యానాం (ముమ్మిడివరం): అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తోంది. వందలాది మంది ప్రయాణించే పలు కల్వర్టులకు రెయిలింగ్‌లు, పిట్టగోడలు కట్టకపోవడంతో వాటిపై వెళుతున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని దొమ్మేటిపేట ఇండస్ట్రియల్ రహదారికి వెళ్లే ప్రదేశంలో ప్రధాన రహదారికి చేర్చి ఉన్న కల్వర్టుకు రెయిలింగ్ లేకపోవడంతో ఆదివారం నలుగురు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న మారుతీకారు అదుపుతప్పి ఎనిమిది అడుగుల లోతు ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. కారులోని మహిళకు గాయాలు కాగా, మరో వ్యక్తి తలకు తీవ్రగాయమైంది. కారు డ్రైవర్‌ది స్వీయ తప్పిదం కావడంతో పోలీస్ కేసు నమోదు కాలేదు. వీరు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విధంగా గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా పరిశ్రమలు ఉండే ప్రదేశం కావడంతో లారీలు, ట్రాక్టర్లు, భారీ వాహనాలు ఈ కల్వర్టు మీదుగా వెళుతుంటాయి. ఇది వరకు కల్వర్టుకు ఒకవైçపు మాత్రమే పిట్టగోడ ఉండేది. అదీ కూడా ఇటీవల పడిపోవడంతో రెండు వైపులా రక్షణ గోడ లేక తరుచూ వాహనాలు పడిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం సంబంధిత అధికారులు స్పందించి ఇరువైపులా రెయిలింగ్‌ను నిర్మించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment