
ఖైరతాబాద్: వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసారాంబాగ్ ప్రాంతానికి చెందిన మణికంఠ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తన పుట్టిన రోజు కావడంతో స్నేహితులు వెంకట రమణయ్యశెట్టి, పవన్‌కుమార్, వత్సల్‌తో కలిసి ఐ–10 కారులో అర్ధరాత్రి ఎన్టీఆర్‌మార్గ్‌కు వచ్చి ఫొటోలు దిగారు.
అనంతరం లుంబినీ పార్క్ వైపునకు వెళ్తుండగా ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో కారు అదుపు తప్పి హుస్సేన్‌సాగర్ వైపు దూసుకెళ్ళి ఇనుప గ్రిల్‌ను ఢీ కొని సాగర్‌లో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాహదారుల సమాచారంతో సైఫాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment