రోడ్డు ప్రమాదంలో యాంకర్‌‌కు గాయాలు | Anchor Lobo injured in road accident in Janagama district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో స్టార్‌ మా యాంకర్‌‌కు గాయాలు

May 21 2018 2:04 PM | Updated on Mar 22 2024 11:30 AM

ప్రముఖ ‘స్టార్‌ మా’  యాంకర్‌, నటుడు   మొహమ్మద్‌ కయిమ్‌ (లోబో) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు...ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో లోబోతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం జనగాం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న జనగాం డీఎస్పీ మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి, వివరాలు అడిగి తెలసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా లోబో... కుమారి 21ఎఫ్‌ చిత్రంలో తన నటన ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement