జర్మనీలో గొడ్డలితో దొరికినవారిని దొరికినట్లు.. | Seven injured in axe attack at German train station | Sakshi
Sakshi News home page

జర్మనీలో గొడ్డలితో దొరికినవారిని దొరికినట్లు..

Published Fri, Mar 10 2017 10:08 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

జర్మనీలో గొడ్డలితో దొరికినవారిని దొరికినట్లు..

జర్మనీలో గొడ్డలితో దొరికినవారిని దొరికినట్లు..

జర్మనీ: విదేశాల్లో వరుస దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఓపక్క అమెరికాలో జాతి విద్వేశంతో తెల్ల జాతి దుండగులు కాల్పులతో రెచ్చిపోతుండగా జర్మనీలో ఓ వ్యక్తి గొడ్డలితో రాక్షసంగా ప్రవర్తించాడు. ఓ రైల్వే స్టేషన్‌లోకి చొరబడి విచక్షణా రహితంగా దొరికిన ప్రతి ఒక్కరిని నరకడం మొదలుపెట్టాడు. దీంతో దాదాపు ఏడుగురు గాయాలపాలయ్యారు. జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఇలాంటి దాడులు ఇక్కడ జరుగగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గురువారం రాత్రి యుగోస్లావియాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఓ 36 ఏళ్ల వ్యక్తి మానసికంగా బాధపడుతున్నాడు. అతడు అనూహ్యంగా గొడ్డలి తీసుకొని రాత్రి 8.50గంటల ప్రాంతంలో రైల్వేస్టేషన్‌లోకి అడుగుపెట్టి గొడ్డలితో తీవ్రంగా దాడికి చేశాడు. పోలీసులు అక్కడి చేరుకోవడంతో అతడు పారిపోయేందుకు ఓ పెద్ద గోడ నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం అతడిని విచారించే పరిస్థితిల్లో లేడని, మానసికంగా దెబ్బతిని ఉన్నాడని మాత్రం తమకు అర్ధం అయిందని చెప్పారు. ఈ ఘటన కారణంగా స్టేషన్‌ ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొందని, ఎక్కడికక్కడా ట్రాఫిక్‌ జామ్‌ కూడా అయిందని అన్నారు. రైల్వే స్టేషన్‌ ప్రాంగణం ఎక్కడ చూసిన రక్తపు మరకలతో దర్శనం ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement