జమ్మూ కాశ్మీర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని ఆర్.ఎస్.పురా, ఆర్నియా సెక్టార్లపైకి పాక్ సైన్యం శనివారం తుపాకి గుళ్ల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారని పోలీసులు ఉన్నతాధికారి వెల్లడించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డరని తెలిపారు. మృతులు మహమ్మద్ అక్రం అతని కుమారుడు అస్లాం (13)గా గుర్తించినట్లు చెప్పారు.
అక్రమ భార్యతోపాటు ముగ్గురు చిన్నారులు, ఓ బిఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను జమ్మూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్ వైపు నుంచి కాల్పుల ఇంకా కొనసాగుతున్నాయని... భారత్ వెంటనే స్పందించి పాక్ బలగాలపైకి కాల్పులకు దిగిందన్నారు.