Minister Errabelli Dayakar Rao Jangaon Issue VRAs Blocked Minister Errabelli Dayakar Rao At Jangaon - Sakshi
Sakshi News home page

Errabelli Dayakar Rao: కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత.. మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం

Published Sat, Jul 23 2022 11:38 AM | Last Updated on Sat, Jul 23 2022 12:19 PM

VRAs Blocked Minister Errabelli Dayakar Rao At Jangaon - Sakshi

Errabelli Dayakar Rao.. సాక్షి, జనగామ: జిల్లాలోని కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును అడ్డుకునేందుకు వీఆర్‌ఏలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీఆర్‌ఏలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో తోపులాట చోటుచేసుకుంది. 

అయితే, అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి.. గ్రామపంచాయితీ అభివృద్ది పనులకు సంబంధించిన నిధుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాగి పడేసిన మద్యం సీసాలను గ్రామపంచాయతీ సిబ్బంది సేకరించి వాటిని అమ్మేసి.. వచ్చిన డబ్బులను అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇందుకు వ్యతిరేకంగానే నేడు మంత్రిని వీఆర్‌ఏలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: కేటీఆర్‌ ట్వీట్‌కు బండి కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement