తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన 27 జిల్లాల జాబితాలో జనగామ పేరు లేకపోవడంతో.. ఆగ్రహించిన స్థానికులు ఆందోళనల బాటపట్టారు.
జనగామ జిల్లా కోరుతూ ర్యాలీ
Aug 31 2016 4:33 PM | Updated on Sep 4 2017 11:44 AM
జనగామ: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన 27 జిల్లాల జాబితాలో జనగామ పేరు లేకపోవడంతో.. ఆగ్రహించిన స్థానికులు ఆందోళనల బాటపట్టారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం అఖిలపక్షం ఆధ్యర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి జనగామను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ.. ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. ఈ ర్యాలీలో అన్ని పార్టీల నాయకులతో పాటు న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Advertisement
Advertisement