
ప్రయాణాల్లో హెల్మెట్ తప్పకుండా ధరించాలంటూ నెల్లూరులో (Nellore) పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేస్తుండగా.. ప్రజలు మాత్రం ఇవేమీ తమకు పట్టవంటూ ర్యాలీ పక్కనుండే హెల్మెట్ (Helmet) లేకుండా ఇలా ప్రయాణిస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
అనంతపురంలో సూర్యోదయం (Sun Rise) వేళ ప్రకృతి తన సుందర రూపాన్ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా సర్పం ఆకారంలో ఉన్న మేఘం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని పలువురు తమ సెల్‌ఫోన్‌ల్లో చిత్రీకరించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
విశాఖపట్నంలో 27వ రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ కాలేజీల క్రీడలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఇందులో భాగంగా ఓ విద్యార్థి ఇలా హైజంప్ (High Jump) చేస్తున్నాడు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
కొన్నేళ్లుగా తమ కాలనీలోనే ఉంటున్న ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను తమకు దూరంలోని మోడల్ పాఠశాలకు తరలిస్తున్నారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం చుంచులూరు ఎస్సీ కాలనీ వాసులు ధర్నా. అనంతరం ఆత్మకూరు వెళ్లి ఆర్డీవో పావనికి వినతిపత్రం సమర్పించారు.
పాఠశాలలో అక్షర జ్ఞాపకాల దొంతరలతో తడవాల్సిన బాల్యం పొట్ట చేతబట్టుకుని బతుకు జీవుడా అంటూ మండే ఎండలో స్వేదంతో తడిసి ముద్దవుతోంది. ప్రభుత్వం బడి బయట ఉన్న బడి ఈడు చిన్నారులను పాఠశాల బాట పట్టించడంలో విఫలమైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు–చినకోండ్రుపాడు, నిమ్మగడ్డవారిపాలెం మార్గాల్లో చిన్నారులు ఇలా మేకలు కాసుకుంటూ కనిపించారు.
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బుధవారం ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతం కావడంతో చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలోని టేకుమంద జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు జేజేలు పలికారు. జయహో ఇస్రో, జయహో భారత్ అంటూ పాఠశాలకు చెందిన కలాం సైన్స్ క్లబ్ నినాదాలు చేసింది. ‘ఇస్రో 100’ అనే అక్షర ప్రదర్శన నిర్వహించి జేజేలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment