
ఉల్లి ధరలు తగ్గించాలని రాస్తారోకో
అమలాపురం (తూర్పుగోదావరి జిల్లా) : చుక్కలనంటుతున్న ఉల్లి ధరలు వెంటనే తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాస్తారోకోకు దిగింది. ఈ మేరకు గురువారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి విశ్వరూప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మేరకు పెరిగిన ఉల్లి ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.