లక్సెట్టిపేట్ (ఆదిలాబాద్) : కళాశాలలో కనీస వసతులు కూడా కరువయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీసం మరుగుదొడ్లు కూడా లేవంటూ మంగళవారం విద్యార్థినీవిద్యార్థులు మంచిర్యాల-ఆదిలాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సుమారు అరగంటపాటు చేపట్టిన ఆందోళనతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా పోలీసులు విద్యార్థులను సముదాయించి, ఆందోళన విరమింపజేశారు.