గొల్లపల్లి (కరీంనగర్) : అన్నదాతల సమస్యలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ శుక్రవారం కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ వైఖరి వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు జగిత్యాల- ధర్మారం రోడ్డుపై గంటసేపు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ సురేఖకు వినతిపత్రం అందజేశారు.
రైతు సమస్యలపై కాంగ్రెస్ రాస్తారోకో
Published Fri, Sep 11 2015 4:32 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement