
న్యూఢిల్లీ: దేశీ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల విభాగంలో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా... ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో తన ’క్యాప్చర్’ వాహనాన్ని సోమవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 9.99 లక్షలు – రూ. 13.88 లక్షలుగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ ఆప్షన్‌లో 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్, లీటరుకు 13.87 కిలోమీటర్ల మైలేజీ, డీజిల్ ఆప్షన్‌లో 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్.. లీటరుకు 20.37 కి.మీ. మైలేజీ ఉంటుంది.
ఆధునిక ఫీచర్స్‌తో స్టయిలిష్‌గా ఉండే ఎస్‌యూవీలను ఇష్టపడుతున్న కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా క్యాప్చర్‌ని తీర్చిదిద్దినట్లు రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈవో సుమిత్ సాహ్నీ తెలిపారు. భారత్‌లో ఈ ఏడాది 46 శాతం మేర పెరిగిన ఎస్‌యూవీ విభాగంలో తమ వాటా మరింత పటిష్టం చేసుకునేందుకు క్యాప్చర్ తోడ్పడగలదని చెప్పారాయన.
ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డేటైమ్ రనింగ్ లైట్స్, ఆడియో సిస్టమ్ తదితర 50 ఫీచర్లు క్యాప్చర్‌లో ఉంటాయి. పెట్రోల్ ఆప్షన్ రేటు రూ.9.99 లక్షల నుంచి రూ. 11.69 లక్షల దాకా, డీజిల్ వెర్షన్ రేటు రూ. 11.39 లక్షల నుంచి రూ. 13.88 లక్షల దాకా ఉంటుంది. హ్యుదాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో మొదలైన వాటితో క్యాప్చర్ పోటీపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment