‘పేట’లో 100 కిలోలగంజాయి పట్టివేత? | Three accused 100 kg cannabis Captured | Sakshi
Sakshi News home page

‘పేట’లో 100 కిలోల గంజాయి పట్టివేత?

Published Sat, Feb 20 2016 2:02 AM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

Three accused  100 kg cannabis Captured

* పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
* గంజాయితో పాటు స్కోడాకారు స్వాధీనం
* విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు
* తరలిన పోలీస్‌బృందం

సూర్యాపేటమున్సిపాలిటీ  : కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను శుక్రవారం  సూర్యాపేట పట్టణం ఖమ్మం క్రాస్‌రోడ్డులో స్థానిక పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు..ఖమ్మం జిల్లా నుంచి ఖరీదైన స్కోడాకారు డిక్కీలో గంజాయి తీసుకుని ముగ్గురు యువకులు హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం క్రాస్‌రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తున్నారు.

అనుమానాస్పదంగా కనిపించిన స్కోడాకారును పక్కకు నిలిపి డిక్కీ తెరువగా అందులో గంజాయి కనిపించింది. వెంటనే ఉన్నతాధికారులతో పాటు పోలీసులు అప్రమత్తమై కారును చుట్టముట్టి నిందితులును అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద లభ్యమైన గంజాయి వంద కిలోలకుపైగా ఉండవచ్చునని సమాచారం. అనంతరం గంజా యి తరలిస్తున్న ముఠా వెనుక ఎవరి హస్తం ఉందో విచారణ చేపట్టేందుకు వెం టనే నిందితులతో పాటు పోలీస్‌బృందం హైదరబాద్‌కు వెళ్లినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement