ఐదు క్వింటాళ్ల గంజాయి పట్టివేత | Capture five quintals of cannabis | Sakshi
Sakshi News home page

ఐదు క్వింటాళ్ల గంజాయి పట్టివేత

Published Tue, Feb 7 2017 7:33 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

Capture five quintals of cannabis

చింతూరు(తూర్పుగోదావరి): తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి భారీగా పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు చింతూరు మండలం మోతుగూడెం పెదవాగు వద్ద మంగళవారం కాపు కాశారు.

ఈ సందర్భంగా వారు అనుమానాస్పదంగా వస్తున్న లారీని ఆపి సోదాలు జరిపారు. అందులో దాచి ఉంచిన రూ.26 లక్షల విలువైన 530కిలోల గంజాయిని గుర్తించారు. ఈ సందర్భంగా ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, గంజాయి సహా లారీని స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement