అడవిలో వీడియో తీస్తున్న వ్యక్తిపై పిడుగు పడితే? | Video Captures Terrifying Moment Of US Biologist Goes Viral | Sakshi
Sakshi News home page

అడవిలో వీడియో తీస్తున్న వ్యక్తిపై పిడుగు పడితే?

Published Thu, Oct 5 2023 11:56 AM | Last Updated on Thu, Oct 5 2023 12:03 PM

Video Captures Terrifying Moment of us Biologist - Sakshi

సోషల్‌ మీడియాలో పిడుగుపాటుకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే ఒక వీడియో వైరల్‌గా మారింది. వన్యప్రాణి నిపుణుడు, జీవశాస్త్రవేత్త ఒకరు ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ సిటీలో వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురయ్యారు. ఆ భయానక క్షణం వీడియోలో నిక్షిప్తమై, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల 35 ఏళ్ల ఫారెస్ట్ గాలంటే సౌత్ ఫ్లోరిడాలో తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియోను షూట్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వీడియోలోని వివరాల ప్రకారం అడవిలోని నీటిలో నిలుచుకున్న ఫారెస్ట్ గాలంటే మాట్లాడుతూ ‘మాకు అద్భుతమైన షాట్‌లు వస్తున్నాయి. ఇది అందమైన రోజు. ఇక్కడి నీరు నిలకడగా ఉంది. షూటింగ్‌ అద్భుతంగా జరుగుతోంది. ఇక షూటింగ్‌ చివరి దశలో ఉంది. వర్షం పడడం మొదలవుతోంది. ఇది ఫ్లోరిడా. ఇక్కడ తరచూ వర్షాలు కురుస్తుంటాయి. అన్ని వేళలా మెరుపులు, ఉరుములు కనిపిస్తాయి’ అని చెప్పాడు. ఇంతలో అతని పక్కనే పిడుగుపడింది. దీంతో అతను నీటిలోకి కొద్దిగా ఒరిగాడు. 

ఈ ఘటన తర్వాత అతను మాట్లాడుతూ ‘ఆ సమయంలో కాంతిని చూడలేకపోయాను. ఆకస్మిక పిడుగు దాడితో నా మైండ్‌ మొద్దుబారిపోయింది. విపరీతమైన వెలుగు రావడంతో నేను ఏమీ చూడలేకపోయాను. ఈ ఘటనలో నాకు, నా బృందానికి పెద్దగా గాయాలు కాలేదని, అయితే తనకు శరీరమంతా నొప్పిగా ఉందని, తన గొంతు ఎండిపోయినట్లుందని’ గాలంటే తెలిపారు. 
ఇది కూడా చదవండి: 200 ఏళ్లనాటి జైలు ఎందుకు మూతపడింది?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement