Biologist
-
ఐదోసారీ పెళ్లికి సిద్ధమైన మర్డోక్
కాలిఫోర్నియా: మీడియా రంగ దిగ్గజం రూపర్ట్ మర్డోక్‌కు 92 ఏళ్ల వయస్సులో మళ్లీ పెళ్లి కుదిరింది. రష్యాకు చెందిన మాజీ మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎలెనా ఝకోవా(67)ను త్వరలో ఆయన పెళ్లి చేసుకోనున్నారు. జూన్‌లో వీరిద్దరు ఒక్కటవుతారని, ఇప్పటికే ఆహ్వాన పత్రాలు కూడా పంపారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఆస్ట్రేలియాలో జన్మించిన మర్డోక్‌కు గతేడాది అన్ లెస్లీతో ఎంగేజ్మెంట్ అయింది. అనంతరం ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి మర్డోక్ ఎలెనాతో డేటింగ్ చేస్తున్నారు. మర్డోక్‌కు ఇది ఆరో ఎంగేజ్మెంట్ కాగా, అయిదో పెళ్లి. -
అడవిలో వీడియో తీస్తున్న వ్యక్తిపై పిడుగు పడితే?
సోషల్ మీడియాలో పిడుగుపాటుకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే ఒక వీడియో వైరల్‌గా మారింది. వన్యప్రాణి నిపుణుడు, జీవశాస్త్రవేత్త ఒకరు ఫ్లోరిడాలోని ఎవర్గ్లేడ్స్ సిటీలో వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురయ్యారు. ఆ భయానక క్షణం వీడియోలో నిక్షిప్తమై, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల 35 ఏళ్ల ఫారెస్ట్ గాలంటే సౌత్ ఫ్లోరిడాలో తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియోను షూట్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వీడియోలోని వివరాల ప్రకారం అడవిలోని నీటిలో నిలుచుకున్న ఫారెస్ట్ గాలంటే మాట్లాడుతూ ‘మాకు అద్భుతమైన షాట్లు వస్తున్నాయి. ఇది అందమైన రోజు. ఇక్కడి నీరు నిలకడగా ఉంది. షూటింగ్ అద్భుతంగా జరుగుతోంది. ఇక షూటింగ్ చివరి దశలో ఉంది. వర్షం పడడం మొదలవుతోంది. ఇది ఫ్లోరిడా. ఇక్కడ తరచూ వర్షాలు కురుస్తుంటాయి. అన్ని వేళలా మెరుపులు, ఉరుములు కనిపిస్తాయి’ అని చెప్పాడు. ఇంతలో అతని పక్కనే పిడుగుపడింది. దీంతో అతను నీటిలోకి కొద్దిగా ఒరిగాడు. ఈ ఘటన తర్వాత అతను మాట్లాడుతూ ‘ఆ సమయంలో కాంతిని చూడలేకపోయాను. ఆకస్మిక పిడుగు దాడితో నా మైండ్ మొద్దుబారిపోయింది. విపరీతమైన వెలుగు రావడంతో నేను ఏమీ చూడలేకపోయాను. ఈ ఘటనలో నాకు, నా బృందానికి పెద్దగా గాయాలు కాలేదని, అయితే తనకు శరీరమంతా నొప్పిగా ఉందని, తన గొంతు ఎండిపోయినట్లుందని’ గాలంటే తెలిపారు. ఇది కూడా చదవండి: 200 ఏళ్లనాటి జైలు ఎందుకు మూతపడింది? How close have you come to being hit by lightning? This is insane. The host of Discovery Plus and Animal Planet, @ForrestGalante, was actually hit by lightning while recording. In the video, you can see he was discussing the importance of having a GPS device, when a huge bolt… pic.twitter.com/lseyEzgNUZ — Ed Krassenstein (@EdKrassen) October 2, 2023 -
నిద్రపై ప్రభావం చూపే చంద్రకాంతి...
చంద్రకాంతి సైతం నిద్రపట్టడంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు బయాలజిస్టులు. స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పరిశోధనశాలలో అచ్చం చంద్రకళలు ఏర్పడేలా అన్ని ఏర్పాట్లు చేశారు. పున్నమి రోజున ఉండే కాంతిని ప్రసరించినప్పుడు ఈ పరిశోధుల్లో అత్యధికులకు నిద్రపట్టడం ఆలస్యం అయ్యింది. అలాగే వారు నిద్రపోయే వ్యవధి సైతం రోజుకంటే కనీసం 20 నిమిషాలు తగ్గింది. నిద్రతాలూకు గాఢత కూడా కనీసం 30 శాతం తగ్గింది ఈ మేరకు నిద్రలో వెలువడాల్సిన అన్ని రకాల హార్మోన్ల మీదా చంద్రకళల ప్రభావం పడిందని వెల్లడించారు పరిశోధకులు. చంద్రుణ్ణి చూస్తూ నిద్రపోయేవారిలో మాత్రమే గాక... చంద్రుడి ఉనికిని మరచిపోయిన వారిలోనూ ఆటోమేటిగ్గా చంద్రుడి ప్రభావం వారివారి నిద్ర పైనా, ఆ వ్యవధిపైనా, నిద్రనాణ్యతపైనా పడుతుందని వెల్లడిస్తున్నారు స్విస్ సైంటిస్టులు. -
ఆహారాన్వేషణలో అతిచురుకైనవి
జంతు ప్రపంచం {పపంచంలో మొత్తం ఐదు వేల రకాల తూనీగలు ఉన్నాయి. ఇవి అన్ని ఖండాల్లోనూ ఉంటాయి... అంటార్కిటికాలో తప్ప! తూనీగలకు రెండు జతల రెక్కలుంటాయి. అయితే మిగతా కీటకాల్లాగ ఎగిరేందుకు రెక్కల్ని ఆడించాల్సిన అవసరం ఉండదు వీటికి. అందుకే ఈగలు తమ రెక్కల్ని సెకనుకు మూడు వందలసార్లు ఆడిస్తే, తూనీగలు మాత్రం ముప్ఫైసార్లే ఆడిస్తాయి! ఇవి చాలా వేగంగా ఎగురుతాయి. అలాగే పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, పక్కలకు... ఎలా అయినా ఎగరగలవు!వీటి కనుగుడ్ల నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత వల్ల... తల తిప్పకుండానే అన్ని వైపులకూ చూడగలుగుతాయి! చిన్న చిన్న పురుగులు, దోమలు, లార్వాలు, పూలలోని తేనె, చిన్న చిన్న చేపలు వీటి ఆహారం. దోమలను అన్నిటికంటే ఇష్టంగా తింటాయి. ఒక్కరోజులో కొన్ని వేల దోమల్ని హాం ఫట్ చేసేస్తాయి! ఇవి నేలమీద జీవించగలవు. నీటిలోనూ జీవించగలవు. అందుకే ఎక్కువగా నీటి చెలమల చుట్టుపక్కలే కనిపిస్తుంటాయి!చాలాసార్లు ఆడ, మగ తూనీగల మధ్య హక్కుల కోసం పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇవి పోట్లాడుకుంటాయి. ఒకదాన్నొకటి తరుముకుంటాయి. ఎగరడంలో పోటీలు కూడా పెట్టుకుంటాయి. మగ తూనీగలు ఆడ తూనీగల మీద కోపంతో విరుచుకుపడుతుంటాయి కూడా! వీటి రెక్కలు చాలా బలహీనంగా, పలుచగా ఉంటాయి. వేడి ఎక్కువ తగిలితే వెంటనే కాలిపోతాయి. అందుకే అతి వేడిమి దగ్గరకు పోకుండా ఇవి జాగ్రత్తపడుతుంటాయి! ఇవి ఆహారాన్ని వేటాడటంలో చాలా చురుకుగా ఉంటాయి. ఒకేసారి రెండిటిని పట్టుకునేందుకు కూడా ప్రయత్నిస్తాయి. ఎగిరిపోతోన్న రెండు దోమల్ని టార్గెట్ చేసి, ఒకదాని తర్వాత ఒకదాన్ని వెంటవెంటనే పట్టుకోవడం గమనించిన వైడర్మ్యాన్ అనే జీవ శాస్త్రవేత్త ఈ విషయాన్ని బయటపెట్టారు! వీటికి నిల్వ ఆహారం నచ్చదు. ఎప్పటికప్పుడు తాజాగా వేటాడి తినాలి. కాసేపు నిల్వ అయినా ఇక దాన్ని ముట్టుకోవు! వీటికి కోపం చాలా ఎక్కువ. తాము వెళ్లేదారికి ఏదైనా అడ్డు వస్తే విసుగు వచ్చేస్తుంది వీటికి. ఎగిరేటప్పుడే వేరే తూనీగ తనను దాటి వెళ్లిపోవాలని చూసినా ఇవి తట్టుకోలేవు. దానికన్నా వేగంగా ఎగరాలని, దాన్ని డామినేట్ చేయాలని ప్రయత్నం చేస్తాయి!