నిద్రపై ప్రభావం చూపే చంద్రకాంతి...
చంద్రకాంతి సైతం నిద్రపట్టడంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు బయాలజిస్టులు. స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పరిశోధనశాలలో అచ్చం చంద్రకళలు ఏర్పడేలా అన్ని ఏర్పాట్లు చేశారు. పున్నమి రోజున ఉండే కాంతిని ప్రసరించినప్పుడు ఈ పరిశోధుల్లో అత్యధికులకు నిద్రపట్టడం ఆలస్యం అయ్యింది. అలాగే వారు నిద్రపోయే వ్యవధి సైతం రోజుకంటే కనీసం 20 నిమిషాలు తగ్గింది.
నిద్రతాలూకు గాఢత కూడా కనీసం 30 శాతం తగ్గింది ఈ మేరకు నిద్రలో వెలువడాల్సిన అన్ని రకాల హార్మోన్ల మీదా చంద్రకళల ప్రభావం పడిందని వెల్లడించారు పరిశోధకులు. చంద్రుణ్ణి చూస్తూ నిద్రపోయేవారిలో మాత్రమే గాక... చంద్రుడి ఉనికిని మరచిపోయిన వారిలోనూ ఆటోమేటిగ్గా చంద్రుడి ప్రభావం వారివారి నిద్ర పైనా, ఆ వ్యవధిపైనా, నిద్రనాణ్యతపైనా పడుతుందని వెల్లడిస్తున్నారు స్విస్ సైంటిస్టులు.