
కాలిఫోర్నియా: మీడియా రంగ దిగ్గజం రూపర్ట్ మర్డోక్‌కు 92 ఏళ్ల వయస్సులో మళ్లీ పెళ్లి కుదిరింది. రష్యాకు చెందిన మాజీ మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎలెనా ఝకోవా(67)ను త్వరలో ఆయన పెళ్లి చేసుకోనున్నారు. జూన్‌లో వీరిద్దరు ఒక్కటవుతారని, ఇప్పటికే ఆహ్వాన పత్రాలు కూడా పంపారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ఆస్ట్రేలియాలో జన్మించిన మర్డోక్‌కు గతేడాది అన్ లెస్లీతో ఎంగేజ్‌మెంట్ అయింది. అనంతరం ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి మర్డోక్ ఎలెనాతో డేటింగ్ చేస్తున్నారు. మర్డోక్‌కు ఇది ఆరో ఎంగేజ్‌మెంట్ కాగా, అయిదో పెళ్లి.
Comments
Please login to add a commentAdd a comment