శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కౌలాలంపూర్ నుంచి బయలుదేరి బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో వారు అనుమానాస్పదంగా కస్టమ్స్ అధికారులకు కన్పించారు. దీంతో అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి లోదుస్తుల్లో నుంచి 1.2 కేజీల బరువున్న బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు శ్రీలంక దేశానికి చెందిన వారుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.