రైతు కూలీ సంఘం నాయకులు
విజయనగరం కంటోన్మెంట్ : భూస్వాములు కబ్జా చేసిన చెరువులను వదిలేసి, దళిత,ఆదివాసీలు సాగు చేసుకుంటున్న చెరువుల్లో (నీరు లేనివి) ‘నీరు-చెట్టు’ పనులు ఎలా చేపడతారని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలగాడ కృష్ణ, పి. మల్లిక్, ప్రగతి శీల మహిళా సంఘ జిల్లా కన్వీనర్ పి. రమణి, తదితరులు ప్రశ్నించారు. ఈ మేరకు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెరువు గర్భాల్లో సాగు చేసుకుంటున్న దళితులకు భవిష్యత్‌లో ప్రభుత్వం సాగు హక్కు కల్పించే అవకాశం ఉందన్నారు. వారి పొట్టకొట్టడానికే ప్రభుత్వం ‘నీరు-చెట్టు’లో భాగంగా జేసీబీతో పనులు చేపడుతోందని తెలిపారు. టీడీపీ నాయకులకు లాభం చేకూరేలా ఈ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. పెత్తందారులు స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కుమ్మక్కై పేదలు సాగు చేస్తున్న చెరువుల్లోనే పనులు చేపట్టడం దారుణమన్నారు. అనంతరం కలెక్టర్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
పేదల భూముల్లో ‘నీరు-చెట్టు’ పనులా ?
Published Tue, May 31 2016 11:52 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement