Water-tree program
-
నీరు-చెట్టు పనులపై విజిలెన్స్‌కు ఫిర్యాదు
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పొదలకూరు: నీరు-చెట్టు, ఉపాధిహామీ పనులపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఆయన మండలాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ నీరు-చెట్టు కార్యక్రమం కింద చేసిన పనులకే అంచనాలు రూపొందించి సొమ్ము చేసుకుంటున్నట్లుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇరిగేషన్ ఏఈ కరిము ల్లా మండలంలో చేపడుతున్న నీరు-చెట్టు పనుల వివరాలను తెలియజేయగా, ఎమ్మెల్యే గతంలో నీరు-చెట్టు కింద చేపట్టిన పనుల వివరాలు ఉన్నా యా? అని ప్రశ్నించారు. దీంతో ఏఈ నీళ్లు నమిలి తన వద్ద సరైన సమాచారం లేదన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత గుంతలను చూపించి బిల్లులు చేసుకుంటున్నట్లు అందుతున్న ఫిర్యాదులను కలెక్టర్ దృ ష్టికి తీసుకువెళ్తామన్నారు. ఫారంఫాండ్‌స పనులను యంత్రాలతో చేపట్టి నిధులను స్వాహా చేయడంపై విజిలెన్స్‌కు ఆధారాలతో సహా నివే దిస్తామన్నారు. గ్రామసభలు ఏర్పాటు చేయాలి జన్మభూమి కమిటీలతో సంబం ధం లేకుండా గ్రామసభలను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే కాకాణి అధికారులకు సూచించారు.కొత్త నిబంధలన ప్రకారం గృహనిర్మాణశాఖ అధికారులు గ్రామసభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయా ల్సి ఉందన్నారు. నిబంధనలు పాటించకుంటే అధికారులు ఇబ్బందు లు పడాల్సి వస్తుందన్నారు. ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, ఎంపీడీఓ సీహెచ్ శ్రీహరి, డి ప్యూటీ త హసీల్దార్ బీ మురళీ పాల్గొన్నారు. -
పేదల భూముల్లో ‘నీరు-చెట్టు’ పనులా ?
రైతు కూలీ సంఘం నాయకులు విజయనగరం కంటోన్మెంట్ : భూస్వాములు కబ్జా చేసిన చెరువులను వదిలేసి, దళిత,ఆదివాసీలు సాగు చేసుకుంటున్న చెరువుల్లో (నీరు లేనివి) ‘నీరు-చెట్టు’ పనులు ఎలా చేపడతారని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలగాడ కృష్ణ, పి. మల్లిక్, ప్రగతి శీల మహిళా సంఘ జిల్లా కన్వీనర్ పి. రమణి, తదితరులు ప్రశ్నించారు. ఈ మేరకు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెరువు గర్భాల్లో సాగు చేసుకుంటున్న దళితులకు భవిష్యత్‌లో ప్రభుత్వం సాగు హక్కు కల్పించే అవకాశం ఉందన్నారు. వారి పొట్టకొట్టడానికే ప్రభుత్వం ‘నీరు-చెట్టు’లో భాగంగా జేసీబీతో పనులు చేపడుతోందని తెలిపారు. టీడీపీ నాయకులకు లాభం చేకూరేలా ఈ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. పెత్తందారులు స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కుమ్మక్కై పేదలు సాగు చేస్తున్న చెరువుల్లోనే పనులు చేపట్టడం దారుణమన్నారు. అనంతరం కలెక్టర్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. -
‘నీరు-చెట్టు’కు పురిటి కష్టాలు
► ఆదిలోనే పథకానికి అడ్డంకులు ► 311కుగాను 37 చెరువుల్లోనే పనులు ► ఇంజినీర్లపై ఒత్తిడి పెంచుతున్న కలెక్టర్ ► సెలవుల్లో వెళ్లే యోచనలో అధికారులు ► ఇద్దరు ఈఈలు ఇప్పటికే సెలవు బాట చెరువుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి వాటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమానికి పురిటి కష్టాలు పీడిస్తున్నాయి. గతేడాది ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే పనులు మొదలు పెట్టకుండానే ఇక్కట్లు చుట్టుముట్టాయి. వంద ఎకరాలకుపైగా ఆయకట్టున్న చెరువుల్లో నీటి వినియోగదారుల సంఘాలు, ఆ లోపు ఆయకట్టున్న చెరువుల్లో జన్మభూమి కమిటీలతో పూడికతీత పనులు చేయించాలని ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 311 చిన్ననీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖల చెరువులకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. వెంటనే పనులు ప్రారంభించాలని భావిస్తున్న కలెక్టర్ ఆ మేరకు అధికారులను పరుగులు పెడుతుండగా అంతతొందరెందుకంటూ అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో జల వనరుల శాఖ ఇంజినీర్లు సతమతమవుతున్నారు. మరోవైపు ఇంజినీర్ల కొరత, పంచాయతీరాజ్ శాఖ చెరువుల్లో పూడికతీత పనులకు జన్మభూమి సభ్యుల పోటాపోటీ కారణంగా వివాదాలు ముదురుతున్నాయి. ఆళ్లగడ్డ, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లె మండలాల్లో ఒక్క చెరువు పని కూడా మొదలు కాలేదని అధికారులే చెబుతున్నారు. ఇదే సమయంలో యంత్రాల కొరత, పూడిక మట్టిని పొలాలకు తరలించుకునేందుకు రైతులు ముందుకు రాకపోవడం కూడా ఇందుకు పనులు ప్రారంభం కాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. మొత్తంగా 311 చెరువులకు గాను గురువారం వరకు 37 చె రువుల్లో మాత్రమే పనులు ప్రారంభం కావడం గమనార్హం. యంత్రాల ఏర్పాటుపై వివాదం.. పూడికతీత పనులకు చాలా చోట్ల ప్రొక్లెయిన్ల కొరత వేధిస్తుండడంతో వాటిని సమకూర్చేందుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో ఆయా గ్రామాల్లోని చెరువుల్లో పనులు ప్రారంభించాలంటూ ఏఈఈలు నీటి సంఘాల అధ్యక్షులపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే యంత్రాలను తామే ఏర్పాటు చేసుకుంటామని చెబుతున్నా పట్టించుకోరేంటని ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నేతలు ఇంజినీర్లపై మండిపడుతున్నారు. పనులు ప్రారంభించాలని ఓ వైపు కలెక్టర్ ఒత్తిడి పెంచుతుండగా అధికారపార్టీ నేతల నిర్వాకంతో జాప్యం తప్పడం లేదు. మరోవైపు కరువు కారణంగా చాలా మంది పశ్చిమ ప్రాంతాల చిన్న, సన్నకారు రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో పూడిక మట్టిని పొలాలకు తరలించుకునే వారు కరువయ్యారు. అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితులను ఇంజినీర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే సాహసం చేయడం లేదని తెలుస్తోంది. కలెక్టర్ మాత్రం పనులు చేయించాలని వెంటపడుతుండడంతో చాలా మంది ఇంజినీర్లు అనారోగ్య కారణాలు చూపి సెలవుల్లో వెళ్లే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కేసీ కాల్వ ఈఈ కొండారెడ్డి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లారు. మైనర్ ఇరిగేషన్ కర్నూలు డివిజన్ ఈఈ శ్రీనివాసులు బుధవారం నుంచి ఇదే బాట పట్టినట్లు తెలిసింది. -
డబ్బులే డబ్బులు!
సాక్షి ప్రతినిధి, కడప : ‘వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటేనేం’ అన్న సామెత టీడీపీ నేతలకు అతికినట్లు సరిపోతోంది. ‘నీరు-చెట్టు’ కార్యక్రమం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు కల్పతరువుగా మారింది. నీటి సంరక్షణ చర్యలు అటుంచితే, కార్యకర్తల జేబులు నింపుతోంది. నిరుపయోగమైన పనుల ద్వారా కోట్లు కొల్లగొడుతున్నారు. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న రాయచోటి ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు ‘పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ’ అన్నట్లుగా అనవసర పనులతో రూ.7 కోట్లు వెనకేసుకున్నారు. లక్కిరెడ్డిపల్లె చుట్టూ ఉన్న వంకల్లో కంప చెట్లు తొలిగించి, చదును చేసి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని స్వాహా చేసిన వైనమిది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో తొలివిడతగా 155 చెరువుల్లో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా పూడికతీత పనులు చేపట్టారు. అందుకుగాను రూ.7.5 కోట్లు వెచ్చించారు. ఈ పనులు జూన్‌కు పూర్తయ్యాయి. అప్పట్లో చెరువులోని మట్టిని రైతులు అధిక శాతం పొలాలకు తరలించారు. మరికొన్ని చోట్ల లే ఔట్లకు తరలించి టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా అధికారులు బిల్లులు చెల్లించి స్వామి భక్తి ప్రదర్శించారు. ప్రస్తుతం రెండవ విడతగా చెరువుల్లోకి నీరు వచ్చే మార్గాల్లోని వాగులు, వంకల్లో పూడికతీత పనులు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 214 పనులు గుర్తించి ఆ మేరకు జూలై నుంచి పనులు ప్రారంభించారు. ఇప్పటికే 100 పనులు పూర్తి కాగా, మరో 70 పనులు నిర్మాణ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో 44 పనులు ప్రారంభించాల్సి ఉంది. రెండవ విడత మొత్తం పనులకుగాను జిల్లా వ్యాప్తంగా రూ.22.5 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో ఇప్పటికే దాదాపుగా రూ.17 కోట్లు బిల్లులు చెల్లించారు. -
వైఎస్సార్సీపీ పంచాయతీలకు ‘నీరు-చెట్టు’ దూరం
పెళ్లకూరు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన ‘నీరు-చెట్టు’ పనులు వైఎస్సార్సీపీ పంచాయతీలకు దూరమయ్యాయి. మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకం కింద రూ. 5.78 కోట్లు, ఇరిగేషన్ కింద రూ. 38.81 లక్షల నీరు-చెట్టు పనులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి. ‘నీరు-చెట్టు’ పనులను జన్మభూమి కమిటీ సభ్యులు చేపట్టడంతో మండలంలోని చిల్లకూరు, జీలపాటూరు, ముమ్మారెడ్డిగుంట, పెళ్లకూరు, కలవకూరు, పుల్లూరు, అర్ధమాల గ్రామాల్లో వైఎస్సార్సీపీ సర్పంచ్‌లు ఉన్నందున నిధులు కేటాయించలేదు. శిరసనంబేడు, చావలి, రోసనూరు, కానూరు, పెన్నేపల్లి, పాలచ్చూరు, బంగారంపేట, నందిమాల, చెన్నప్పనాయుడుపేట, కొత్తూరు గ్రామాల్లో సర్పంచులకు సంబంధం లేకుండా స్థానిక టీడీపీ నాయకులు ‘నీరు-చెట్టు’ పనులు చేస్తున్నారు. అధికారపార్టీ నాయకులకు అధికారుల దాసోహం పార్టీలకతీతంగా నీరు-చెట్టు పనులను చేపట్టి గ్రామాభివృద్ధికి పాటుపడాల్సిన అధికారులు అధికారపార్టీ నాయకులకు దాసోహం అంటున్నారు. చిల్లకూరు, పెళ్లకూరు, నెలబల్లి, రోసనూరు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణల్లో వర్షపునీరు చేరి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జీలపాటూరు, రోసనూరు, పుల్లూరు చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టి సాగునీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలి. ‘నీరు-చెట్టు’ పనులు చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సర్పంచులు ఉన్న చోట జన్మభూమి కమిటీలు ‘నీరు-చెట్టు’ పనులను దూరం చేయడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అన్ని పంచాయతీల్లో పార్టీలకతీతంగా ‘నీరు-చెట్టు’ పనులు చేపట్టి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
మంత్రి ఉమాకు ‘నీరు-చెట్టు’ ముడుపులు
మహిళా తహశీల్దార్‌పై దాడి సిగ్గుమాలిన చర్య దాడి చేసిన ఎమ్మెల్యే సహా అందరిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి విజయవాడ : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో రోజువారీ ముడుపులు అందుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలసు పార్థసారథి విమర్శించారు. అక్రమాలకు పాల్పడుతున్నవారికి మంత్రి ఉమా ప్రత్యక్షంగా కొమ్ముకాస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కారణంగానే ప్రభుత్వ అధికారులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పార్థసారథి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ముసునూరు మండల తహశీ ల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీధి రౌడీ తరహాలో దాడి చేయటం సిగ్గుమాలిన చర్యని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు నిసిగ్గుగా ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారని, అడ్డుకున్న అధికారులపై దాడులకు పాల్పడి అందరినీ బెదిరిస్తున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ ఎంపీ ఒకరు దేశాన్ని రక్షించే సైన్యాన్ని కించపరిచేలా సిగ్గులేకుండా మాట్లాడారని, నేడు ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్న చింతమనేని ప్రభాకర్ అక్రమాలను అడ్డుకోవడానికి వెళ్లిన తహశీల్దార్‌పై దాడిచేయడం గర్హనీయమన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం అవినీతిమయంగా మారిందని తాము కలెక్టర్‌కు విన్నవించినా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విమర్శించారు. టీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేలా పనిచేస్తోందని పేర్కొనారు. ఎమ్మెల్యే ప్రభాకర్, అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు -
తమ్ముళ్లు మన్ను తిన్నారు!
గర్నెపూడి(సత్తెనపల్లి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంపై ఆదిలోనే నీలి నీడలు కమ్ముకున్నాయి. భూగర్భ జలాల పరిరక్షణకు చెరువులను అభివృద్ధి చేసుకుని పూడిక మట్టితో కరకట్టల బలోపేతం, పంట పొలాలు, సామాజిక అవసరాలకు వినియోగించు కోవాలని ఇప్పటికే శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సూచనలు చేశారు. ఆ సూచనలను తెలుగు తమ్ముళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ప్రతి నీటి బొట్టును వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పూడిక తీత చేసి గట్లు, చెరువులను అభివృద్ధి చేయాలన్నది ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం. అయితే పనులు చేపట్టిన తమ్ముళ్లు మట్టిని సైతం అమ్ముకుంటున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా మా కెందుకులే అని మిన్నకుంటున్నారు తప్ప పట్టించుకోవడం లేదు. సత్తెనపల్లి మండలం గర్నెపూడి గ్రామంలో ఐదు ఎకరాల చెరువును నీరు-చెట్టు కార్యక్రమం కింద అభివృద్ధి చేసేందుకు ఇటీవల పనులు ప్రారంభించారు. ఇక్కడ పనులు ప్రారంభం కావడంతో తమ్ముళ్లకు ఎక్కడా లేని ఆశలు పుట్టుకొచ్చాయి. ట్రక్కు మట్టిని రూ. 300లు చొప్పున 250 ట్రక్కులను ఇప్పటికే విక్రయించారు. ఆ ఆదాయాన్ని గ్రామ పంచాయతీకి జమ చేయకుండా సర్పంచ్, కార్యదర్శికి తెలియకుండానే అన్ని పనులు జరిపించేస్తున్నారు. పంచాయతీకి సీనరేజీ కూడా జమ చేయడం లేదు. దీనిపై సర్పంచ్ బోగాల బాపిరెడ్డి ఇదేమిటని మాట్లాడితే తాము చేసేది చూస్తుండటం తప్ప మరేమీ మాట్లాడవద్దని, ఎక్కువ చేస్తే చెక్ పవర్ కూడా ఉండదంటూ హెచ్చరికలు చేశారు. జరుగుతున్న అన్యాయంపై ఎంపీటీసీ ఓబయ్య, ఉప సర్పంచ్ బిళ్లా సుజాతలు గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేయగా తాను సెలవులో ఉన్నానని తప్పుకున్నారు. ఎంపీడీవో పి.శ్రీనివాస్ పద్మాకర్‌కు ఫిర్యాదు చేయగా పనులకు ఆటంకం కల్గించవద్దని, ప్రస్తుతం తాను సెలవులో ఉన్నానని సమాధానం ఇచ్చారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్ర వారం చెరువు స్థలంలో మట్టి తీయకుండా పొక్లయిన్‌ను అడ్డుకున్నారు. తమ పనులకు అడ్డు రావద్దంటూ టీడీపీ నాయకులు వాగ్వివాదానికి దిగారు. కొద్ది సేపు ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఎమ్మెల్యే వద్ద తేల్చుకుంటామంటూ తమ్ముళ్లు సత్తెనపల్లి చేరుకున్నారు. దీనిపై సర్పంచ్ బాపిరెడ్డి, ఎంపీటీసీ ఓబయ్య మాట్లాడుతూ నీరు-చెట్టు కార్యక్రమం కింద చెరువుల అభివృద్ధి సర్పంచ్ చేపడతారని తొలుత చెప్పారని, కేవలం తాము వైఎస్సార్సీపీ అనే ఉద్దేశంతో తెలుగు తమ్ముళ్లకు అవకాశం ఇచ్చారన్నారు. అయినప్పటికీ మట్టి అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసు కోవడంతోపాటు ప్రజాప్రయోజనాలకు చెరువు మట్టి ఉపయోగపడేలా చూడాలని, పంచాయతీకి ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. చివరకు మట్టి అక్రమ విక్రయాలను వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. -
ఏటా కోటి మొక్కలు
ఏలూరు : జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం కింద మొక్క లు నాటేందుకు డ్వామా, సామాజిక అటవీ విభాగాలు కసరత్తు ప్రారంభించాయి. ఈ కార్యక్రమం కింద ఏటా కోటి మొక్కలు నాటాలని నిర్ణయించాయి. ప్రభుత్వ కార్యాలయూలు, ఇరిగేషన్ స్థలాలు, ప్రైవేటు స్థలాలతోపాటు ఆర్ అండ్ బీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే సామాజిక వన విభాగం ఏటా 50 లక్షల మొక్కలను పాఠశాలలు, ప్రభుత్వ కార్యాల యూలు, వివిధ సంస్థలకు పంపిణీ చేస్తోంది. ఇకపై ఏటా కోటి మొక్కలు నాటించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి. అయితే, మన జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే అడవులున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఏటా కోటి మొక్కల్ని నాటడం ద్వారా ఈ విస్తీర్ణాన్ని పెంచాలనే లక్ష్యంతో ఉన్నారు. ఐదేళ్ల ప్రణాళిక జిల్లాలో నీరు-చెట్టు పథకం కింద 2015 నుంచి ఐదేళ్లపాటు పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు నిర్ణయించామని సామాజిక వనవిభాగం అధికారి ఎం.శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో నీడనిచ్చే మొక్కలు, చిన్నపాటి కలపనిచ్చే మొక్కలు నాటిస్తామన్నారు. రైతులకు సంబంధించిన స్థలాల్లో యూకలిప్టస్, సముద్ర తీరం, డెల్టా ప్రాంతాల్లో సరుగుడు మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. మొక్కలు నాటేం దుకు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు ఎంతమేరకు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం సేకరిస్తున్నామని వివరించారు.