టేకు కలప పట్టివేత
Published Wed, Sep 7 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
నల్లబెల్లి : బోలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను సోమవారం తెల్లవారుజామున నల్లబెల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై మేరుగు రాజమౌళి కథనం ప్రకారం.. నల్లబెల్లి పోలీసులు సోమవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తుండగా లెంకాలపల్లి వైపు నుంచి ఓ బోలెరో వాహనం వేగంగా వస్తుండగా ఆపే ప్రయత్నం చేశారు.
డ్రైవర్ ఆపకుండా వెళ్లడంతో వెంబడించి అడ్డుకున్నారు. తనిఖీ చేయ గా ఆ వాహనంలో 80 ఫీట్లుగల 22 టేకు దుంగలను ఉంచి పైనుంచి పరదా కప్పి ఉంచారు. డ్రైవర్ బొడరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా నర్సంపేటకు చెందిన మేకల రాంబా బు చత్తీస్‌గఢ్ నుంచి కలపను నర్సంపేటకు కల ప తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. టేకు దుంగల విలువ మార్కేట్‌లో రూ.2.40 లక్షలు ఉంటుంద ని తెలిపారు. దాడిలో హెడ్‌కానిస్టేబుల్ యాక య్య, కానిస్టేబుళ్లు దేవ్‌సింగ్, సాధన్, రమేష్, సుకేందర్, పాషా, హెచ్‌జీ రాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement