
450 లీటర్ల డీజిల్ పట్టివేత
గుంతకల్లు టౌన్ : ఆయిల్ ట్యాంకర్ నుంచి డీజిల్‌ను కొట్టేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించేందుకు పోర్టర్స్‌లైన్‌లోని ఓ గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 450 లీటర్ల డీజిల్‌ను గుంతకల్లు రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి డీజిల్ దందాతో సంబంధం కలిగిన వ్యక్తిని కేసు నుంచి తప్పించి స్వామిభక్తిని చాటుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి. సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం మధ్యాహ్నం తహశీల్దార్ యల్లమ్మతో పాటు ఇతర రెవెన్యూ అధికారులంతా పోర్టర్స్‌లైన్ దర్గా ఏరియాకి వెళ్లారు.
ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఓ ట్యాంకర్ నుంచి డీజిల్‌ను కొట్టేసి క్యాన్‌లలో నింపుకుంటున్నారు. తహశీల్దార్ కారును ఆపి ఘటనా స్థలానికి వెళ్లారు. డీజిల్ ట్యాంకులను గోడౌన్‌లో పడేసి పరారైయ్యారు. డీజిల్ నిల్వ ఉంచిన గోడౌన్ షట్టర్‌కి తహశీల్దార్ తాళం వేయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత ఆర్‌ఐ కేశవరెడ్డి, వీఆర్వోలు గురుప్రసాద్, కృష్ణ ఆ డీజిల్‌ను లెక్కించారు. అక్రమంగా డీజిల్‌ను నిల్వ చేసిన ఈశ్వర్ అనే యువకుడిపై సెక్షన్ 6ఎ సివిల్ సప్లయ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఆర్‌ఐ వెల్లడించారు.
ఆయిల్ ట్యాంకర్ మాయం: పట్టణంలోని పోర్టర్స్‌లైన్ దర్గా సమీపంలో ఓ ఆయిల్ ట్యాంకర్ నుంచి డీజిల్‌ను కొట్టేస్తున్న సమయంలో రెవెన్యూ అధికారులను చూసి ఆ ట్యాంకర్ మాయం కావడం అనేక అనుమానాలకి తావిస్తోంది. అధికారులు డీజిల్‌ను పట్టుకున్న వెంటనే చమురు దందాను చేసే టీడీపీకి చెందిన అసలు సూత్రధారి హుటాహుటిన ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో రెవెన్యూ అధికారులకి ఫోన్ చేయించడంతోనే ఈ ట్యాంకర్‌ను వదిలేసినట్లు స్థానికు లు ఆరోపిస్తున్నారు.
పైగా డీజిల్ దందా చేసే వ్యక్తికి తని ఖీలకు వచ్చిన ఓ రెవెన్యూ ఉద్యోగికి మాంచి మిత్రుడు కావడంతో ట్యాంకర్‌తో పాటు అసలు సూత్రధారిని కేసుల్లో నుంచి తప్పించారన్న విమర్శలు వినిపిస్తున్నా రుు. ఈ విషయమై ఆర్‌ఐ కేశవరెడ్డిను వివరణ కోరగా తాము కారు దిగుతుండగానే ట్యాంకర్ వేగంగా వెళ్లిపోయిందని, తామేమి తప్పించలేదని సమాధానమిచ్చారు.
అధికారులతో మాట్లాడాం.. కవరేజీ చేయకండి : అధికారుల కు పెద్దొళ్లతో ఫోన్ చేసి చెప్పించాం.. మీడి యా వారిని మేనే జ్ చేసుకోవాలని నేతలు కార్యకర్తలకు సలహా ఇచ్చారు. దీంతో దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. మీకేమైనా కావాలంటే ఇస్తామంటూ కొందరు టీడీపీ మద్దతుదారులు అక్కడున్న విలేకరులను బ్రతిమలాడారు. అయితే విలేకర్లు పట్టించుకోకపోవడంతో కేవలం 50 లీటర్లు దొరికిందనైనా రాయండన్నా అంటూ ఈ డీజిల్ దందాతో సంబంధమున్న ఓ వ్యక్తి బుజ్జగింపులకు దిగాడు. ఏది ఏమైనప్పటికీ అధికారులు మాత్రం టీడీపీ ఒత్తిళ్లకు తలొగ్గే ‘మామూలే’నంటూ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.