‘బెల్లం’ బాగుంది
అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో మంగళవారం రికార్డుస్థాయిలో 42887 బెల్లం దిమ్మల లావాదేవీలు జరిగాయి. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఈ నెల 16న 25,535 దిమ్మలు రాగా, మంగళవారం 42,887 దిమ్మలు అమ్మకం జరగడం గమనార్హం. మొదటిరకం రూ.2960లు ధర పలికింది. లావాదేవీలతో పాటు ధరలు పెరగడంతో వ్యాపారులు, రైతులు ఆనందపడ్డారు.
ఆదివారం సెలవు కావడంతో పాటు సోమవారం నల్లబెల్లంపై నోటీసులు కారణంగా మార్కెట్‌లో అమ్మకాలు, కొనుగోలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇలా రెండురోజులు లావాదేవీలు ఆగిపోవడంతో రైతులు పెద్ద ఎత్తున బెల్లం మార్కెట్‌కు తెచ్చారు. మార్కెట్‌లోని యార్డులన్నీ కళకళలాడాయి. ప్రస్తుతం నల్లబెల్లం వివాదం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
లావాదేవీలపై ఆ ప్రభావం ఉన్నప్పటికీ రైతులకు ఊరటనిచ్చేలా ధర పలికింది. పండగ దృష్ట్యా రైతులు బెల్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. లావాదేవీలు జరపగా వచ్చిన సొమ్ముతో పండగకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి ముందు వరకు ఇదే తరహా జోరు మార్కెట్‌లో కనిపించనుంది.