RECORDED
-
రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా..
దేశంలో వాతావరణ పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు నెలకొనివుంది. దక్షిణ భారతదేశంలో వర్షాకాలం కొనసాగుతోంది. హిమాచల్‌లోని కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఎముకలు కొరికే చలి వ్యాపించింది. శుక్రవారం రాత్రి శ్రీనగర్‌లో ఈ సీజన్లో అత్యంత చలి వాతావరణం ఏర్పడింది. నగరంలో ఉష్ణోగ్రత -4.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం రానున్న రెండు రోజుల్లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల్లో వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గే అవకాశం ఉంది. #WATCH | Tamil Nadu: Heavy rain lashes parts of Coimbatore city early morning pic.twitter.com/2b9NmFCStR — ANI (@ANI) December 9, 2023 తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం దేశంలోని జార్ఖండ్, బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ , అండమాన్, నికోబార్ దీవులలో వర్షాలు కురుస్తాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 12న పశ్చిమ బెంగాల్, సిక్కింలో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 10న దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజస్థాన్‌లోనూ చలి ప్రభావం పెరుగుతున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ⛈️ Weather Alert! Possibility of scattered rain in parts of #Karnataka and #Kerala! 🌧️ #RainyDay #KarnatakaWeather #KeralaRain pic.twitter.com/2zg3lu1P3U — Weather & Radar India (@WeatherRadar_IN) December 9, 2023 ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ విషయానికి వస్తే శనివారం ఉదయం చల్లగాలులు వీచాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ-ఎన్సీఆర్లో డిసెంబర్ 15 తర్వాత చలి గణనీయంగా పెరగనుంది. కనిష్ట ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి! -
భారత్‌లో యాపిల్ రికార్డు.
న్యూఢిల్లీ: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్‌లోనూ దుమ్మురేపుతోంది. భారత్ సహా పలు మార్కెట్లలో పటిష్టమైన పనితీరు ఆసరాతో ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో యాపిల్ రికార్డు స్థాయిలో 64.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో 59 శాతం విదేశీ అమ్మకాల ద్వారా వచ్చిందే కావడం గమనార్హం. ఇక నికర లాభం 12.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సెప్టెంబర్‌లో యాపిల్ భారత్‌లో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, రీసెర్చ్ సంస్థ కెనాలిస్ వెల్లడించిన గణాంకాల ప్రకారం యాపిల్ జూలై–సెప్టెంబర్ కాలంలో రెండంకెల వృద్ధితో రికార్డు స్థాయిలో సుమారు 8 లక్షల ఐఫోన్లను విక్రయించినట్లు అంచనా. ఫాక్స్‌కాన్, విస్ట్రాన్‌ల భాగస్వామ్యంతో యాపిల్ ఇటీవలే భారత్‌లో ఐఫోన్ 11 అసెంబ్లింగ్‌ను ప్రారంభించింది. ‘భౌగోళికంగా, అమెరికా, యూరప్, మిగతా ఆసియా పసిఫిక్‌లో మేం సెప్టెంబర్ క్వార్టర్లో రికార్డులు సృష్టించాం. భారత్‌లోనూ మాకు ఇది రికార్డు క్వార్టర్‌గా నిలిచింది. తాజాగా ప్రారంభించిన ఆన్లైన్ స్టోర్‌కు భారత్‌లో అపూర్వ ఆదరణ లభించడం ఆనందం కలిగిస్తోంది’ అని ఫలితాల ప్రకటన సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు. -
చిన్నారులపై వ్యాధుల పంజా!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలోపు పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సకాలంలో అన్ని రకాల టీకాలు తీసుకోకపోవడం, ఇతరత్రా జాగ్రత్తలు చేపట్టకపోవడం తదితర కారణాల వల్ల ఈ వయసు పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలపై అనేక జబ్బులు దాడి చేస్తున్నాయని తేలింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు అంటే 10 నెలల కాలంలో మలేరియా కేసులు దేశవ్యాప్తంగా 4.96 లక్షలు నమోదు కాగా, అందులో తెలంగాణలో 6,075 నమోదయ్యాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 5,940 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దేశంలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 16వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,582 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 623 కేసులు నమోదు కావడం గమనార్హం. సిరిసిల్ల జిల్లాలో 514 మలేరియా కేసులు నమోదయ్యాయి. మలేరియా నియంత్రణ చర్యలు సక్రమంగా చేపట్టకపోవడం వల్లే ఈ ఏడాది ఈ పరిస్థితి నెలకొందని వైద్య నిపుణులు అంటున్నారు. టీకా మరణాల్లో ఎనిమిదో స్థానం.. పిల్లలకు వివిధ రకాల టీకాలు వేసిన అనంతరం చనిపోయిన సంఘటనల్లో దేశంలో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో నిలిచింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో టీకాలు వేసిన అనంతరం 12 మంది చనిపోగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో గత 10 నెలల్లోనే 24 మంది చనిపోయారని కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 11 మంది టీకాలు వేసిన అనంతరం చనిపోగా, ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలో 9 మంది చనిపోయారు. ఖమ్మం జిల్లాలో ఇద్దరు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. టీకాల వల్ల వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ కేసులు ఈ ఏడాది అధికంగా నమోదయ్యాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 546 కేసులు నమోదు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 నెలల్లోనే 738 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. టీకాల సైడ్ ఎఫెక్ట్స్‌లో తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో నిలిచింది. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 309 టీకా సైడ్ ఎఫెక్ట్స్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో 123 మంది పిల్లలకు టీకాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. అయితే లక్షలాది మందికి టీకాలు వేస్తున్నప్పుడు ఈ మాత్రం సంఘటనలు సహజమేనని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వ్యాఖ్యానించడంపై విమర్శలు వస్తున్నాయి. టీకాలను సరిగా నిల్వ చేయకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల మరణాలు సంభవించాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారి వ్యాఖ్యానించారు. భారీగా పెరిగిన డిఫ్తీరియా కేసులు.. ఐదేళ్లలోపు పిల్లల్లో డిఫ్తీరియా కేసులు రాష్ట్రంలో రెట్టింపు స్థాయి లో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 83 డిఫ్తీరియా కేసులు నమోదవ్వగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో 10 నెలల్లోనే 149 పెరగడం గమనార్హం. ఇందులో దేశంలో తెలంగాణ 6వ స్థానంలో నిలిచిం ది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం లో 80 డిఫ్తీరియా కేసులు నమోదయ్యాయి. ఆ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు. హైదరాబాద్‌లోనూ 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఒక్క డిఫ్తీరియా కేసు కూడా లేకపోగా, 2019–20లో 10 నెలల్లో ఇప్పటికే 50 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గతేడాది కంటే ప్రసవ మరణాలు పెరిగాయి. గత సంవత్సరంలో 337 మంది బాలింతలు చని పోగా, ఈ ఏడాది జనవరి వరకు 389 మంది చనిపోయారని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్రం దేశంలో 12వ స్థానంలో ఉంది. గతే డాది కంటే ఈ ఏడాది డయేరియా కేసులు రాష్ట్రంలో బాగా పెరిగాయి. 2018–19లో ఐదేళ్లలోపు పిల్లల్లో 39,541 డయేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరికి 42,597 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో అత్యధి కంగా 7,932డయేరియా కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. ఐదేళ్లలోపు పిల్లల్లో రక్తహీనత కేసులు కూడా పెరిగాయి. గతేడాది 5,940 మంది రక్తహీనతకు గురి కాగా, ఈ ఏడాది జనవరి వరకు 6,075 కేసులు నమోదయ్యాయి. -
మండుతున్న సూర్యుడు
సాక్షి, హైదరాబాద్: ఇంకా జనవరి నెల కూడా ముగియలేదు కానీ, అప్పుడే సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సోమవారం రాష్ట్రంలో అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో ఏకంగా 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, ఖమ్మం, నిజామాబాద్‌ల్లో 34 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్, రామగుండంలలో 33 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్, మెదక్‌ల్లో 32 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ఇదిలావుండగా మధ్య భారతం నుంచి తుపాన్ వ్యతిరేక గాలులు వీస్తుండటంతో వేడి వాతావరణం నెలకొని ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితి రానున్న మరో రెండ్రోజులు ఉంటుందని తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంగానే నమోదవుతాయని వెల్లడించారు. -
ఎన్నికల వేళ ట్వీట్ల మోత
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్విట్టర్ ట్వీట్లతో మోగుతోంది. ఎన్నికలపై పలు సంభాషణలు, చర్చల ద్వారా గత వారంలో ఏకంగా 12 లక్షల ట్వీట్లు నమోదైనట్లు ట్విట్టర్ పేర్కొంది. ఎన్నికల కార్యక్రమాల్లో భాగంగా..ట్విట్టర్ రాష్ట్ర ఎన్నికల కోసం ఒక ప్రత్యేక ఎమోజి, హ్యాష్‌టాగ్‌తో ఎలక్షన్ ఆన్ ట్విట్టర్ ఈవెంట్స్‌ను రూపొందించింది. ప్రత్యక్షంగా ప్రశ్నలు అడిగే సౌకర్యాన్ని కూడా కల్పించింది. దీంతో డిసెంబర్ 23 వరకు ప్రజలకు ఈ ప్రత్యేక #AssemblyElections2018 అందుబాటులో ఉంటుందని ట్విట్టర్ తెలిపింది. దీని ద్వారా రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఎన్నికల సమయం వరకు బహిరంగ సంభాషణలు జరపడానికి, వారు ప్రజలతో నేరుగా మాట్లాడి మద్దతు కూడగట్టడానికి అవకాశం ఉంటుంది. -
సుర్రుమనిపించిన సూరీడు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : భానుడు నిప్పులు చెరిగాడు. ఎండ ప్రచండంతో జిల్లా ప్రజలు విలవిల్లాడారు. సోమవారం జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం వరకు జిల్లాలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడినా.. ఈనెల 13 నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటివరకూ 40–41 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే చవిచూసిన ప్రజలు ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో తల్లడిల్లారు. వడగాడ్పుల తీవ్రత పెరగడంతో జనం రోడ్లపైకి రాలేకపోయారు. వృద్ధులు, చిన్నారులు వేడికి ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రి వేళలోనూ వదలని వేడి సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఎండతీవ్రత కనిపించింది. అత్యవసర పనులు ఉన్నవారు తప్ప ప్రజలెవరూ మధ్యాహ్నం 11 గంటల తరువాత రోడ్లపైకి రావడానికి సాహసం చేయలేకపోయారు. రాత్రి 10 గంటలకు కూడా వేడి గాలులు వదల్లేదు. ఇళ్లల్లోని గోడలు, ధరించిన వస్త్రాలు వేడెక్కి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇళ్లల్లోని మంచినీళ్లు సైతం కాగిపోయాయి. నాసా హెచ్చరికలతో ఆందోళన రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని 8 జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నట్టు నాసా ప్రకటిం చింది. ఆ 8 జిల్లాల్లో పశ్చిమ గోదావరి కూడా ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు రోజులపాటు ఇలానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారంతో అధికారులను కలవరపాటుకు గురి చేస్తోంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. నాలుగు రోజులపాటు ప్రజలు ఎండల్లో తిరగకూడదంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వడదెబ్బ బారిన పడినవారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మీ స్కైప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయా?
కొత్త కొత్త మాల్వేర్లను (మాల్వేర్ అంటే హానికరమైన సాఫ్ట్వేర్) ఉపయోగించి ఖాతాల్లో డబ్బు తస్కరించే హ్యాకర్లనే ఇప్పుటి దాకా చూస్తున్నాం. ఇప్పుడు వారి దృష్టి ఆన్లైన్ సంభాషణలపై పడింది. ఆన్లైన్ లోనే అన్ని రకాల సంభాషణలు జరుపుతున్న నేటి తరుణంలో రహస్య సమాచారాన్ని చోరీ చేసేందుకు హ్యాకర్లు సిద్ధమౌతున్నారు. తాజాగా స్కైప్ లో జరిగే సంభాషణలను రికార్డు చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ఆమెరికా వంటి దేశాల్లో కొత్త మాల్వేర్ ను ఉపయోగించి సైబర్ దాడులకు పాల్పడినట్లు వివరిస్తున్నారు. ఏ దేశంలో నివసిస్తున్న వారితోనైనా మన ముందున్నట్లే మాట్లాడేందుకు స్కైప్‌ను ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తున్నాం. ఇష్టమొచ్చినట్లు అదీ ఇదీ అని లేకుండా ప్రతి విషయాన్నీ స్కైప్ కాల్స్‌లో షేర్ చేసేసుకుంటున్నాం. ఆఫీస్ మీటింగ్‌లు, రహస్య సంభాషణలు అన్నీ స్కై ప్ లో జరిగిపోతున్నాయి. అయితే అత్యంత ప్రాచుర్యం పొందిన స్కైప్‌లో మాట్లాడేప్పుడు ఏవైనా రహస్య సంభాషణలు ఉంటే కాస్త జాగ్రత్త పడాల్సిందేనంటున్నారు సైబర్ నిపుణులు. స్కైప్ లో జరిగే రహస్య సమాచారాన్ని T9000 మాల్వేర్ను ఉపయోగించి తస్కరించేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీడియో సంభాషణలను రికార్డు చేసేందుకు, స్క్రీన్ షాట్లు తీసేందుకు ఈ శక్తివంతమైన T9000 మాల్వేర్ ను వినియోగిస్తున్నట్లు సైబర్ రక్షణాధికారులు చెప్తున్నారు. ఈ మాల్వేర్ ఇప్పుడు ఎటువంటి యాంటీ వైరస్ కు దొరక్కుండా పనిచేస్తున్నట్లు చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ కు చెందిన వీడియో ఛాటింగ్ ప్రోగ్రామ్ స్కైప్ ను ప్రతిరోజూ సుమారు 4.9 మిలియన్ల మంది వాడుతున్నట్లు గతేడాది జరిపిన సర్వేలు చెప్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ లకు పోటీగా స్కైప్ ను వినియోగదారులు వాడటం కనిపెట్టిన హ్యాకర్లు... ఇప్పుడు రహస్య వీడియో సంభాషణల తస్కరణపై దృష్టి పెట్టారు. కొత్తగా వచ్చిన ఈ T9000 మాల్వేర్ మార్కెట్లోని ఎన్నో రకాల సాఫ్ట్ వేర్ లను తప్పుదోవ పట్టించగలదని పాలో ఆల్టో నెట్ వర్కింగ్ సంస్థ చెప్తోంది. ఈ వైరస్.. సిస్టమ్ లో పనిచేసే సుమారు 24 రకాల సెక్యూరిటీ విభాగాలను దాటి వ్యాపించగలదని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. మనం వాడే కంప్యూటర్, లేదా మొబైల్ యాండ్రాయిడ్ పరికరాల్లోని వేటిలోనైనా ప్రవేశించి అందులోని సమాచారాన్ని చోరీ చేయగల శక్తి ఈ వైరస్ కు ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ మాల్వేర్ ను ఇప్పటికే అమెరికాలోని పలు సైబర్ దాడుల్లో వినియోగించినట్లు సంస్థ తెలుపుతోంది. స్కైప్ వినియోగించేందుకు explorer.exe పేరుతో వచ్చే ఫైల్స్ ను నమ్మొద్దని సంస్థ హెచ్చరిస్తోంది. దీన్ని వీడియో ఫైల్స్ ను తస్కరించేందుకు హ్యాకర్లు వాడుతున్నట్లు పాలో ఆల్టో నెట్వర్కింగ్ సంస్థ చెబుతోంది. -
రేప్ కేసులకు నిలయంగా రాజధాని!
ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారతదేశ రాజధాని ఢిల్లీ... ఇప్పుడు హింసా కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమైంది. అత్యాచారాలకు, మానభంగాలకు మారుపేరుగా నిలిచి మహిళకు రక్షణే కరువయ్యింది. దేశంలోని నాలుగు ప్రధాన నగరాలతో పోలిస్తే ఢిల్లీలో గత మూడేళ్ళుగా అత్యాచారాలు, లైంగిక హింసల కేసుల నమోదు ఎక్కువైనట్లు తాజా లెక్కలు చెప్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 25 శాతం రేప్ కేసులు పెరిగినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అదే విధంగా వీధి నేరాలు, దొంగతనాలు, వేధింపుల కేసులు కూడా పెరగడం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మహిళలపై నేరాల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నట్లు ఏకంగా పోలీసు వర్గాలే చెప్తున్నాయి. అంతేకాక సుమారు ప్రతి వెయ్యి నిమిషాలకు ఓ మహిళ అత్యాచారానికి గురౌతున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో తాజా సర్వేలో తేలింది. ఢిల్లీ శివారు ప్రాంతాలు మినహా జరిపిన సర్వేలో ఈ పచ్చి నిజాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఉచిత ఎఫ్ ఐ ఆర్ రిజిస్ట్రేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడ ఈ పెరుగుదల కనిపిస్తోందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి. ఎస్. బాసీ చెప్తున్నారు. 2014 నవంబర్ వరకూ నమోదైన 1,39,799 కేసులతో పోలిస్తే... 2015 నవంబర్ 30 నాటికి 1,74,423 కేసులు దాఖలైనట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా దేశ రాజధానిలో మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసులు 25 శాతం అధికంగా నమోదయ్యాయి. 2014 లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వేధింపులపై సుమారు 4000 ఫిర్యాదులు అందగా... ఆ సంఖ్య 2015 నాటికి 5.027 కు పెరిగింది. అలాగే 2014లో రాజధానిలో అత్యాచార కేసులు సుమారు 1,997 నమోదవ్వగా అది 2015 నాటికి 2,005 కు చేరింది. నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగిన 2012 నాటికి ఢిల్లీలో అత్యాచార కేసులు 706 కాగా.. నేడు అవి వేలల్లోకి చేరాయి. రాజధాని ఢిల్లీలో వీధి నేరాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ల వంటివి కూడా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. 2014 తో పోలిస్తే ఢిల్లీ రోడ్లు అభద్రతకు నిలయాలుగా మారినట్లు తాజా నివేదికలు తేల్చి చెప్తున్నాయి. దీనికి తోడు రాబరీలు ఇరవై శాతం, చైన్ స్నాచింగ్ లు 30 శాతం పెరిగాయి. అయితే ఒకప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నా... ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులూ లేవని, ఫ్రీ రిజిస్టేషన్ అమల్లో ఉందని ఢిల్లీ కమిషనర్ బి ఎస్ బాసీ చెప్తున్నారు. అంతేకాక వాహన చోరీల వంటి కేసులను ఆన్ లైన్ ద్వారా కూడ రిజిస్టర్ చేసే అవకాశం కల్పించినట్లు జాయింట్ కమిషనర్ ర్యాంక్ అధికారి చెప్తున్నారు. అయితే ఢిల్లీ ప్రజల రక్షణ కోసం ఎన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసినా క్రైం రేటు పెరుగుతుండటం ఢిల్లీ పోలీసులకు సవాల్ గా మారుతోంది. 2014 లో 5,873 గా ఉన్న చైన్ స్నాచింగ్, వాహన చోరీల కేసులు 2015 లో 6,969 కి పెరిగాయి. దోపిడీలు, దొంగతనాలు, వేధింపుల కేసులు 2014 నుంచి 2015 నాటికి 15 నుంచి 30 శాతం పెరిగిపోయాయి. రాబోయే రోజుల్లో పెండింగ్ కేసుల వ్యవహారం కూడా పెద్ద సమస్యగా మారనుందని పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
‘బెల్లం’ బాగుంది
అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి బెల్లం మార్కెట్లో మంగళవారం రికార్డుస్థాయిలో 42887 బెల్లం దిమ్మల లావాదేవీలు జరిగాయి. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఈ నెల 16న 25,535 దిమ్మలు రాగా, మంగళవారం 42,887 దిమ్మలు అమ్మకం జరగడం గమనార్హం. మొదటిరకం రూ.2960లు ధర పలికింది. లావాదేవీలతో పాటు ధరలు పెరగడంతో వ్యాపారులు, రైతులు ఆనందపడ్డారు. ఆదివారం సెలవు కావడంతో పాటు సోమవారం నల్లబెల్లంపై నోటీసులు కారణంగా మార్కెట్లో అమ్మకాలు, కొనుగోలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇలా రెండురోజులు లావాదేవీలు ఆగిపోవడంతో రైతులు పెద్ద ఎత్తున బెల్లం మార్కెట్‌కు తెచ్చారు. మార్కెట్లోని యార్డులన్నీ కళకళలాడాయి. ప్రస్తుతం నల్లబెల్లం వివాదం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. లావాదేవీలపై ఆ ప్రభావం ఉన్నప్పటికీ రైతులకు ఊరటనిచ్చేలా ధర పలికింది. పండగ దృష్ట్యా రైతులు బెల్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. లావాదేవీలు జరపగా వచ్చిన సొమ్ముతో పండగకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి ముందు వరకు ఇదే తరహా జోరు మార్కెట్లో కనిపించనుంది.