ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదని అందరికీ తెలిసిందే. పైగా మలబద్దకం ఉండదని తేలిగ్గా ఆహారం జీర్ణం అవుతుందని ఉదయాన్నే గోరువెచ్చగానో లేదా చల్లగానో నీళ్లు తాగుతున్నారు. ఐతే ఆ నీళ్లనే ఔషధ గుణం గల నీళ్లుగా తయారు చేసుకుని తాగితే అధిక బరువు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఆ ఔషధం గుణాలు గల నీళ్లు అంటే ఏమిటి? ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం!.
ఎలా ఔషధ గుణాలు గల నీళ్లుగా మార్చాలి?
- తెల్లవారుజామునే గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. ఇది అద్భుత ఔషధ గుణాలను అందిస్తుంది. పాన్‌లో ఒక గ్లాసు నీటిని పోసి వేడి చేసి దానికి ఒక అంగుళం బెల్లం వేసి కరిగాక చల్లార్చి వకట్టి త్రాగాలి. లేదా బెల్లం ముక్క ప్లేస్‌లో బెల్ల పొడిని కూడా ఉపయోగించొచ్చు. ఇలా నీళ్లను ఔషధ గణాల గల నీరుగా మార్చుకుని తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది.
- బెల్లం జీవక్రియలను పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్నవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. షుగర్ వల్ల బరువు పెరిగితే బెల్లం తినడం వల్ల బరువు అదుపులో ఉండి శరీరం ఫిట్‌గా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- అలాగే బెల్లంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. బెల్లం కండరాల బలానికి ఉపయోగపడుతుంది.
మనం నిత్య జీవితంలో వినియోగించే బెల్లంతో కలిగే అద్భుత ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ రీత్యా అంతా షుగర్‌నే ఎక్కువగా వాడేస్తున్నారు. అదీకాగా షుగర్ అయితే ఈజీగా నీటిలో కరిగిపోతుంది. దీంతో అందరూ దాన్నే ఉపయోగిస్తున్నారు. నిజానికి బెల్లం వల్లే కలిగే ప్రయోజనాలు ఏమీ చక్కెరలో ఉండవు. బెల్లంలో ఉండే పోషక ప్రయోజనాలతో మరొకటి పోటీపడలేదంటే అతిశయోక్తి కాదేమో!. బెల్లంలోని అనేక పోషకాలు ఆరోగ్యానికి అద్భుతంగా మేలు చేస్తాయి. బెల్లం తినడం వల్ల అనేక వ్యాధులు బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో కాల్షియం, జింక్, ఫాస్పరస్, కాపర్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment