
ఆపిల్ ఓట్స్ స్వీట్
హెల్దీ కుకింగ్
తయారి సమయం: 15 నిమిషాలు
కావలసినవి: ఓట్‌మీల్ – నాలుగు టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము – టేబుల్ స్పూన్, యాపిల్ – ఒకటి (చిన్న ముక్కలుగా తరగాలి), దాల్చిన చెక్క పొడి – చిటికెడు, ఉప్పు – చిటికెడు, కిస్మిస్‌లు – టేబుల్ స్పూన్, నీళ్లు – రెండు కప్పులు
తయారి: పాత్రలో నీళ్లు, ఉప్పు, ఓట్స్ వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. బెల్లం తరుము, దాల్చిన చెక్క పొడి, యాపిల్ ముక్కలు వేసి కలిపి, మరో మూడు నిమిషాల పాటు ఉంచాలి. ∙కిస్మిస్‌లు వేసి దింపేసి వేడివేడిగా అందిస్తే రుచిగా ఉంటుంది.