
కేసముద్రం: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టే వంట మనిషి ఇల్లే ప్రభుత్వ పాఠశాలగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పరిధిలోని బ్రహ్మంగారి తండాలో 2001లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. సొంత భవ నం లేక నాటి నుంచి తండాలోని పలువురి ఇళ్లను అద్దెకు తీసుకుంటూ ఉపాధ్యా యులు బడి నడిపిస్తూ వచ్చారు. మొదట్లో స్కూల్‌లో 60 మంది విద్యార్థులు ఉండగా.. అద్దె ఇళ్లలో కనీస సౌకర్యాలు లేక సంఖ్య తగ్గుతూ 18 మందికి చేరింది.
ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తి స్తున్నారు. గత ఏడాది బడి నడిపించడానికి తండాలో అద్దెకు ఇల్లు దొరకలేదు. దీంతో పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో మధ్యాహ్నం భోజ నం వండిపెట్టే వంటమనిషి వినోద తన ఇంట్లో పాఠశాల నడిపించడానికి అంగీకరించింది. ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డుకు చుట్టూరా పరదా కట్టి పిల్లలకు విద్యా బోధన చేస్తున్నారు. ఎండతీవ్రతకు రేకుల షెడ్డు కింద కూర్చున్న పిల్లలు అల్లాడి పోతున్నారు. టాయిలెట్లు కూడా లేకపోవ డంతో ఇబ్బందులు పడుతు న్నారు. ఇదిలా ఉండగా ‘మన ఊరు– మన బడి’ కింద పాఠశాలకు భవనం మంజూరైనా పిల్లర్ల వరకే నిర్మాణం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment