పంచదార కంటె బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్ఠం, బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి ∙ తియ్యని పిండివంటల తయారీలో చాలామంది చక్కెర కంటెæ బెల్లాన్నే ఉపయోగిస్తారు ∙ఆయుర్వేద వైద్యశాస్త్రంలో బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు ∙పొడి దగ్గు ఇబ్బందిపెడుతుంటే... గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది ∙అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
∙కాకర ఆకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు మిరియాల గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజూ రెండు పూటలా వారం రోజులు తీసుకున్నా లేదా గ్లాసు పాలలో పంచదారకి బదులు బెల్లం వేసి రోజూ తాగినా నెలసరి సమస్యలు ఉండవు ∙స్టౌ మీద నేతితో కలిపిన బెల్లం వేడి చేసి, నొప్పి ఉన్న చోట పట్టు వేస్తే బాధ తగ్గుతుంది ∙పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే ముక్కు కారడం సమస్య తగ్గుతుంది ∙బెల్లం నెయ్యి సమపాళ్లలో కలిపి తింటే మైగ్రేన్ తలనొప్పి వారం రోజులలో తగ్గుతుంది.
వంటింటి చిట్కాలు...
Published Sat, Nov 3 2018 1:25 AM | Last Updated on Sat, Nov 3 2018 1:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment