ఇంటిప్స్
వేడినీళ్లలో ముంచిన కత్తిని వాడితే డ్రైఫ్రూట్స్‌ని సులభంగా కట్ చేయవచ్చు. నెయ్యి ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఉంచాలి. వంటగదిలో చీమల దండు అధికంగా ఉంటే దోసకాయను ముక్కలుగా తరిగి చీమలు తిరిగే చోట ఉంచాలి.
వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కూరలో చెంచాడు పాలు పోయాలి. నానబెట్టిన గోరింటాకు పొడితో వెండి వస్తువుల్ని శుభ్రం చేస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి.