ఓట్స్ చిక్కీ | Oates | Sakshi
Sakshi News home page

ఓట్స్ చిక్కీ

Published Sat, Apr 9 2016 11:15 PM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM

ఓట్స్ చిక్కీ - Sakshi

ఓట్స్ చిక్కీ

కావలసినవి: ఓట్స్ - 1 కప్పు, బెల్లం తురుము - అరకప్పు, మైదాపిండి - 4 చెంచాలు, చాక్లెట్ పౌడర్ - 6 చెంచాలు, నీళ్లు - తగినన్ని, అన్ని రకాల డ్రైఫ్రూట్స్ - కావలసినన్ని, నెయ్యి - అవసరానికి తగినంత
 
తయారీ: ఓట్స్‌ని నూనె లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టాలి. మైదాపిండిని కూడా పచ్చి వాసన పోయేవరకూ వేయించి పెట్టాలి. డ్రైఫ్రూట్స్‌ని నేతిలో వేయించి ఉంచుకోవాలి. బెల్లం తురుములో కొద్దిగా నీళ్లు పోసి పాకం పట్టాలి. తీగపాగం అవుతుండగా ఓట్స్, డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత మైదాపిండి కూడా వేసి కలపాలి. మిశ్రమం దగ్గరగా అవుతుండగా చాక్లెట్ పౌడర్ కూడా వేసి కలపాలి. గట్టిగా అయ్యాక దించేసి, నెయ్యి రాసిన ట్రేలో వేయాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement