బెల్లం ఆవకాయను ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. మరి ఈ వంటకం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా!
బెల్లం ఆవకాయ తయారీకి కావలసినవి:
►తోతాపురి మామిడికాయలు – ఐదు
►బెల్లం – అరకేజీ
►నువ్వులనూనె – పావుకేజీ
►ఆవాలు – పావు కేజీ
►కారం – కప్పు, ఉప్పు – కప్పు
►మెంతులు – రెండు టీస్పూన్లు
►పసుపు – రెండు టీస్పూన్లు
►ఇంగువ – అరటీస్పూను
►తొక్కతీసిన వెల్లుల్లి రెబ్బలు – కప్పు.
బెల్లం ఆవకాయ తయారీ విధానం
►ముందుగా మామిడి కాయలను శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకోవాలి.
►కాయల్లో జీడి తీసేసి ముక్కలు చేసుకోవాలి. టెంకపైన ఉన్న జీడిపొరను తీసేసి శుభ్రంగా తుడవాలి.
►ఆవాలు, మెంతులను గంటపాటు ఎండబెట్టి పొడిచేసుకోవాలి
►ఇప్పుడు పెద్ద గిన్నెతీసుకుని ఆవపొడి, పసుపు, మెంతి పిండి, కారం, ఉప్పు వేసి కలపాలి.
►ఇప్పుడు బెల్లాన్ని సన్నగా తురిమి వేయాలి. దీనిలో ఇంగువ కూడా వేసి చక్కగా కలపాలి.
►ఇప్పుడు మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి చేతితో కలపాలి.
►తర్వాత కొద్దిగా ఆయిల్ తీసి పక్కనపెట్టి, మిగతా ఆయిల్ వేసి కలపాలి.
►ఈ మిశ్రమాన్ని పొడి జాడీలో వేసి పైన మిగతా ఆయిల్ వేయాలి.
►మూడు రోజుల తరువాత పచ్చడిని ఒకసారి కలపాలి, జాడీలో నిల్వచేసుకోవాలి.
చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా
చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా రెసిపీ
Comments
Please login to add a commentAdd a comment